Saddula Bathukamma: సద్దుల బతుకమ్మ ఎప్పుడు? క్లారిటీగా చెప్పిన భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకుడు!

తెలంగాణలో బతుకమ్మ సంబరాలు నేటితో  చివరి రోజుకు చేరుకున్నాయి.  ఈరోజు తొమ్మిదవ రోజు సందర్భంగా  'సద్దుల బతుకమ్మ'  జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది  'సద్దుల బతుకమ్మ' రాష్ట్రవ్యాప్తంగా గందరగోళం నెలకొంది.

New Update
Saddula Bathukamma

Saddula Bathukamma

తెలంగాణలో బతుకమ్మ సంబరాలు(saddula bathukamma celebrations) నేటితో  చివరి రోజుకు చేరుకున్నాయి.  ఈరోజు తొమ్మిదవ రోజు సందర్భంగా  'సద్దుల బతుకమ్మ'(Saddula Bathukamma 2025) జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది  'సద్దుల బతుకమ్మ' ఎప్పుడు అనే విషయంపై  రాష్ట్రవ్యాప్తంగా గందరగోళం నెలకొంది.  దీనిపై వేద పండితుల భిన్న ప్రచారాలు ప్రజలను అయోమయంలోకి నెట్టేశాయి. కొందరు పండితులు  'బతుకమ్మ' అనేది ఒక సాంప్రదాయపు పండగ మాత్రమేనని.. ఈ ఉత్సవాలకు శాస్త్రం, తిథులతో సంబంధం లేదని అంటున్నారు. మరొకొందరు పండితులు ఖచ్చితంగా శాస్త్రం, శాస్త్రీయత పాటించాల్సిందేనని చెబుతున్నారు. దీంతో సద్దుల బతుకమ్మ ఎప్పుడు జరుపుకోవాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో 29న, మరికొన్ని ప్రాంతాల్లో 30న  'సద్దుల బతుకమ్మ' చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.  మరి దీనిపై భద్రకాళి ప్రధాన అర్చకులు శేషు శర్మ ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకోండి.. 

Also Read :  పండుగ పూట పెను విషాదం.. నల్గొండలో ముగ్గురు స్పాట్ డెడ్!

సద్దుల బతుకమ్మ ఎప్పుడు?

ప్రధాన అర్చకులు శేషు శర్మ మాట్లాడుతూ.. సద్దుల బతుకమ్మను 2025, 30, మంగళవారం రోజున జరుపుకోవాలని తెలిపారు. మరి అమావాస్య నుంచి 30వ తేదీ వరకు పది రోజులు అవుతుంది కదా? అనే సందేహం ఉన్నవారికి కూడా అర్చకులు శేషు శర్మ క్లారిటీ ఇచ్చారు. శాస్త్రం ప్రకారం.. ఒకే  తిథి రెండు రోజుల పాటు వస్తున్న కారణంగా..30వ తేదీ మంగళవారం నాడు సద్దుల బతుకమ్మ జరుపుకోవాలని తెలంగాణ విద్వత్ సభ నిర్ణయించందని. ఈ మేరకు  30న సద్దుల బతుకమ్మ చేస్కోవాలని భద్రకాళి ప్రధాన అర్చకులు తెలిపారు.

తొమ్మిది రోజుల పాటు సాగే బతుకమ్మ వేడుకలు ఈనెల 21న  'ఎంగిలి పూల బతుకమ్మతో'  మొదలయ్యాయి. దీని ప్రకరాం.. 22న అంటే రెండవ రోజు  'అటుకుల బతుకమ్మ' , 23న (మూడవ రోజు) ముద్ద పప్పు బతుకమ్మ,  24న (నాల్గవ రోజు) నానబియ్యం బతుకమ్మ, 25 (ఐదవ రోజు) అట్ల బతుకమ్మ, 26న (ఆరవ రోజు) అలిగిన బతుకమ్మ, 27న ( ఏడవ రోజు) వేపకాయల బతుకమ్మ 28న ( ఎనిమిదవ రోజు ) వెన్నె ముద్దల బతుకమ్మ..  29 ( తొమ్మిదవ రోజు) చివరి రోజున  'సద్దుల బతుకమ్మ'  ఉంటుంది. కానీ ఈ ఏడాది ఒకే తిథి (28, 29) రెండు రోజుల పాటు వస్తున్న కారణంగా..   30వ తేదీ మంగళవారం సద్దుల బతుకమ్మ జరుపుకోవాలని వేద పండితులు ప్రకటించారు. 


తెలంగాణతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మహిళలు బతుకమ్మ వేడుకలను సంబరంగా జరుపుకుంటున్నారు. లండన్, అమెరికా, కెనడా వంటి దేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పేలా బతుకమ్మ వేడుకలను చేసుకుంటారు. 

Also Read: Saddula Bathukamma: సద్దుల బతుకమ్మపై కన్ఫ్యూజన్.. పండితులు చెబుతున్న కరెక్ట్ డేట్ ఇదే!

Advertisment
తాజా కథనాలు