/rtv/media/media_files/2025/04/28/IigPTvTQffmM8cQ2Tx7Y.jpg)
State Information Commissioners
BIG BREAKING : చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న ప్రధాన, రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకాలను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు పూర్తి చేసింది. ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, 7 గురు ఇన్ఫర్మేషన్ కమిషనర్లను నియమించనున్న ప్రభుత్వం ఈ మేరకు ఆమోదం కోసం గవర్నర్ కు పంపింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తరవాత ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. కాగా ప్రధాన సమాచార కమిషనర్ గా ఐఎఫ్ఎస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డిని నియమించినట్లు తెలిసింది. ఇక మరో ఏడుగురిని ఇన్ఫర్మేషన్ కమిషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది. కమిషనర్లలో సీనియర్ జర్నలిస్టులకు అవకాశం కలిపించారు. వారిలో పీవీ శ్రీనివాస్ రావు. అయోధ్య రెడ్డి బోరెడ్డి, కప్పర హరిప్రసాద్, పీఎల్ఎన్ ప్రసాద్, రాములు, వైష్ణవి, పర్వీన్ మొహిసిన్ లు ఉన్నారు. వీరి నియామకాన్ని ఫైనల్ చేస్తూ కాసేపల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి.
Also Read: వాడో జోకర్.. మోదీజీ పాకిస్తాన్‌ను FATF బ్లాక్‌లిస్ట్‌లో చేర్చండి: అసదుద్దీన్ ఒవైసీ
ఇప్పటికే ప్రధాన సమాచార కమిషనర్ 2020 ఆగస్టు 24న, చివరి సమాచార కమిషనర్ 2023 ఫిబ్రవరి 24న తమ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. అప్పటి నుంచి ఎవరి నియామకమూ జరగలేదు. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారం అడిగినా సకాలంలో ఇచ్చేవారు కరువయ్యారు. దీనిపై కమిషన్‌ను సంప్రదించడానికి.. జిల్లా కమిటీలూ సరిగా లేవు. ఇక అప్పీలు చేద్దామంటే రాష్ట్ర స్థాయిలో కమిషనే లేదు. ఫలితంగా 17 వేలకు పైగా అప్పీళ్లు రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్ కార్యాలయంలో పేరుకుపోయాయి. దీంతో రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకంలో జాప్యంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలంగాణలో హైకోర్టులో పిల్ దాఖలు చేసింది.
Also Read: భారత్, పాక్ మధ్య అణు యుద్ధం.. ఎవరి బలం ఎంత?
కాగా రాష్ట్ర సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కమిషన్‌లో చోటు కోసం రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లు, జర్నలిస్టులు, అడ్వొకేట్లు పెద్దఎత్తున పోటీపడ్డారు. రెండున్నరేండ్లుగా ఖాళీగా ఉన్న కమిషన్‌లో ప్రధాన సమాచార కమిషనర్‌తో పాటు ఆరుగురు కమిషనర్లను నియమించాల్సి ఉంది. మొత్తం ఏడు పోస్టులకు దాదాపు 750 దరఖాస్తులు వచ్చాయి. వీరిలో 55 మంది రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్లవే ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. సీఎస్ శాంతికుమారి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ దరఖాస్తులను నిశితంగా పరిశీలించింది.దరఖాస్తుదారుల్లో ఆర్టీఐ అమలుకు కృషి చేసిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పాటు ఆర్టీఐ నిపుణులు కూడా ఉన్నారు. ప్రధాన కమిషనర్, కమిషనర్లు నియామకమైన నాటి నుంచి ఐదేళ్లు లేదా 65 ఏళ్లు వచ్చే వరకు బాధ్యతల్లో కొనసాగుతారు. వీరిని తిరిగి నియమించడానికి అవకాశం లేదు. కమిషనర్లకు ప్రధాన కమిషనర్‌గా ప్రమోట్ అయ్యే లేదా నియామకం పొందే అర్హత ఉంటుంది. మొత్తంగా ఐదేళ్లకు మించి కొనసాగడానికి వీలు లేదు.
Also Read: ఇండియాతో యుద్ధం వద్దు.. పాక్ మాజీ ప్రధాని కీలక సూచనలు