ఏపీలో షాకింగ్ ఘటన.. వందలాది సీసీ కెమెరాల సీక్రెట్స్ లీక్ చేస్తూ..! ఏపీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. గుంటూరుకు చెందిన సీసీ కెమెరా టెక్నీషియన్ శేషు.. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ యజమానులకు ఇవ్వకుండా రికార్డైన వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురిపై కేసు నమోదు చేశారు. By srinivas 15 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి CC CAMERAS : ఏపీలో మరో షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరాలు ఫిట్టింగ్ చేసే టెక్నిషియన్లు కెమెరాలో రికార్డు అయిన రహస్యాలను తమ ఫోన్ లో బంధించుకుని బెదిరింపులకు పాల్పడుతున్న అంశం కలకలం రేపింది. ఈ మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటుచేసే సంస్థలో టెక్నీషియన్ గా పనిచేస్తున్న శేషు ఈ దారుణానికి పాల్పడుతుండగా అతనికి మద్దతుగా టీవీ రిపైర్ చేసే వంశీ, ఓ విలేకరి అరుణ్ సహకరించినట్లు గుంటూరు పోలీసులు తెలిపారు. వీరిపై నాలుగు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు బయటపడ్డాయని తెలిపారు. Also Read : Aghori: నడిరోడ్డుపై వాడి పురుషాంగం కొయ్యబోతున్నా.. హైదరాబాద్ లో అఘోరీ సంచలనం! పాస్‌వర్డ్ యజమానులకు ఇవ్వకుండా.. ఈ మేరకు గుంటూరు వాసి శేషు.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే సంస్థలో టెక్నీషియన్. ఇండ్లు, ఆఫీసు, బహిరంగ ప్రదేశాలు, వ్యవసాయ క్షేత్రాలు, ఫామ్‌హౌస్‌ల్లో సీసీ కెమెరాలు బిగిస్తుంటాడు. అయితే సీసీ పుటేజికి సంబంధించిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ యజమానులకే ఇవ్వాల్సి ఉండగా.. శేషు మాత్రం తన దగ్గరే ఉంచుకుని దారుణాలకు పాల్పడ్డాడు. ఇది కూడా చదవండి: లెబనాన్, గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. వీడియోలు చూస్తే హడలిపోవాల్సిందే సీసీ ఫుటేజీల్లో రికార్డు అయ్యే దృశ్యాలను తన దగ్గర పెట్టుకుని వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తు బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపారు. అంతేకాదు అరండల్‌పేట పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వీడియోల యాక్సెస్‌ను తనవద్ద పెట్టుకున్నట్లు విచాణలో బయటపెట్టిన పోలీసులు.. పలువురు బాధితుల ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: Buffalo: దున్నపోతుతో నెలకు రూ.5 లక్షలు సంపాదిస్తున్నాడు భయ్యా.. Also Read : పవన్‌పై బన్నీ సంచలన వ్యాఖ్యలు.. అన్‌స్టాపబుల్ షోలో బాలకృష్ణతో అల్లు అర్జున్ రచ్చ రచ్చ! #andhra-pradesh #cc-camera #guntur మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి