Buffalo: దున్నపోతుతో నెలకు రూ.5 లక్షలు సంపాదిస్తున్నాడు భయ్యా.. హర్యానాలోని సిర్సాలో పల్విందర్ సింగ్ అనే రైతు దున్నపోతుతో ఏకంగా నెలకు రూ. 4 లక్షల నుంచి రూ.5 లక్షలు సంపాదిస్తున్నాడు. దాని వీర్యాన్ని మార్కెట్‌లో అమ్మడంతో పాటు ఇతర మార్గాల ద్వారా ఈ డబ్బును ఆర్జిస్తున్నాడు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 15 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఈ సమాజంలో చాలామంది చదువుకొని ఉద్యోగం చేసేవాళ్లకి ఇచ్చే గౌరవం.. వ్యవసాయం చేసేవాళ్లకి, చిరువ్యాపారులకు, గేదెలు, మేకలు కాసుకునే వాళ్లకు ఇవ్వరు. ఒక కంపెనీలో జాబ్ చేసేవాళ్లకన్నా.. ఇలాంటి పనులు చేసేవాళ్లకు తక్కువ ఆదాయం వస్తుందనే అపోహలో ఉంటారు. కానీ రియాల్టీలో చూస్తే ప్రస్తుతం పరిస్థితులు వేరేలా ఉన్నాయి. సరైన ఆలోచనతో ప్లానింగ్ చేసి దాని ఆచరణలోకి తీసుకొస్తే.. నెలకీ లక్షలాది రూపాయలు జీతం తీసుకునేవాళ్లు కూడా ఇలాంటి వాళ్లకి ఎందుకు సరిపోరు. ప్రస్తుతం రోడ్డు పక్కన టీ, సమోసాలు అమ్ముకునే వాళ్లు, ఫుడ్ వ్యాపారం చేసేవాళ్లు కూడా నెలకు లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఓ వ్యక్తి అయితే ఏకంగా దున్నపోతుతో నెలకు రూ.5 లక్షలు సంపాదిస్తున్నాడు. వింటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. దీని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. Also Read: 11వ తరగతి ఖతర్నాక్ కుర్రోడు.. 200 మందిని నిలువునా ముంచేశాడు..! Buffalo ఇక వివరాల్లోకి వెళ్తే హర్యానాలోని సిర్సాలో పల్విందర్ సింగ్ అనే రైతు ఓ దున్నపోతును పెంచుతున్నాడు. దీనికి అన్మోల్ అనే పేరు కూడా పెట్టాడు. దీని వయసు ఎనిమిదేళ్లు. బరువు 1500 కిలోలు. అయితే దున్నపోతు వీర్యాన్ని అమ్ముతూ.. అలాగే ఇతర మార్గాల ద్వారా పల్విందర్ సింగ్ నెలకు రూ.4 నుంచి 5 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఈ దున్న ఖరీదు అక్షరాల రూ.23 కోట్లు. 23 కోట్లు ఇస్తామన్నా కూడా పల్విందర్ సింగ్ ఈ దున్నపోతును అమ్మేందుకు ఇష్టపడటం లేదు. దీన్ని ఎవరికీ అమ్మేది లేదని తెగేసి చెబుతున్నాడు. Also Read : హైదరాబాద్ లో పార్టీ చేసుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు.. ఫొటోలు వైరల్! ఉత్తరాదిన జరిగే పుష్కర్ మేళా, ఆల్ ఇండియా ఫార్మర్స్ ఫెయిర్ వంటి ప్రదర్శనల్లో ఈ అన్మోల్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంటుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ దున్న తిండి కోసం యజమాని ప్రతీరోజూ రూ.1500 వరకు ఖర్చు చేస్తుంటాడు. ఇది అధిక కేలరీలు కలిగిన ఆహార పదార్థాలు, డ్రైఫ్రూట్స్‌ను తింటుంది. దీన్ని మేపేందుకు దాదాపు నెలకు రూ.45 వేలు ఖర్చు అవుతుంది. ప్రతీరోజూ 250 గ్రాముల బాదాం, నాలుగు కిలోల దానిమ్మలు, 30 అరటిపండ్లు, ఐదు లీటర్ల పాలు అలాగే 20 గుడ్లు తింటుంది. Also Read: ద్రౌపది ముర్ముపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. వీటితో పాటు పచ్చిగడ్డి, దేశీ నెయ్యి, ఆయిల్ కేక్, మొక్కజొన్న, సోయాబీన్ కూడా తింటుంది. అన్మోల్ దున్నకు యజమాని పల్విందర్ సింగ్ ప్రతీరోజూ కూడా స్నానం చేయిస్తాడు. ఇందుకోసం బాదాం నూనె, ఆవ నూనెను కూడా వినియోగిస్తుంటాడు. అయితే ఈ దున్నకు ఖర్చు చేసేందుకు నెలకు రూ.45 వేలు ఖర్చు అవుతున్నా కూడా.. దాని వీర్యం ధర మార్కెట్లో అధిక ధరలో ఉంటుంది. మిగతా మార్గాల్లో కూడా ఈ దున్నను వినియోగిస్తారు. అందుకే పల్విందర్ సింగ్ ఈ ఒక్క దున్నపోతుతోనే నెలకి రూ. 4 నుంచి 5 లక్షలు సంపాదిస్తున్నాడు. Also Read : లగచర్ల రైతులతో కేటీఆర్ ములఖాత్.. రేవంత్‌పై సంచలన వ్యాఖ్యలు #buffalo #telugu-news #national-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి