Aghori: నడిరోడ్డుపై వాడి పురుషాంగం కొయ్యబోతున్నా.. హైదరాబాద్ లో అఘోరీ సంచలనం!

అఘోరీ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసింది. త్వరలో హైదరాబాద్ లో నడిరోడ్డుపై ఒకరి పురుషాంగాన్ని కొయ్యబోతున్నానంటూ హెచ్చరించింది. తాను శిక్షించకుంటే తాండవం చేసి ఆత్మార్పణ చేసుకుంటానంటూ హల్ చల్ చేసింది. 

author-image
By srinivas
New Update
ERE

AGHORI : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న అఘోరీ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసింది. త్వరలో నడిరోడ్డుపై ఒకరి పురుషాంగాన్ని కొయ్యబోతున్నానంటూ హెచ్చరించింది. కుంభమేళా తర్వాత తన కార్యాచరణ మరింత ఉధృతం చేస్తానని, సీఎం రేవంత్‌ ప్రభుత్వం తనను ఆపుతుందో చూస్తానని చెప్పింది. గురువారం హైదరాబాద్‌ చైతన్యపురిలో ప్రత్యక్ష మైన అఘోరీ..  హిందూ దేవాలయాలు, మహిళలు, గోవులపై దాడి చేస్తున్న వారిని శిక్షించకుంటే తాండవం చేసి ఆత్మార్పణ చేసుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. 

Also Read :  సరికొత్త హంగులతో ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాల.. చూస్తే మతిపోవాల్సిందే

రేవంత్ ప్రభుత్వానికి దమ్ముంటే.. 

ఇదిలా ఉంటే.. అందరం కలిసికట్టుగా సనాతన ధర్మాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చింది. ‘ఆడపిల్లలను కాపాడుకుందాం, గోహత్యలను ఆపుదాం. ప్రకృతిని కాపాడాలని నా గురువు చెప్పారు. ఇందుకోసం కూడా నా పోరాటం ఉంటుంది. చాలా మంది అఘోరీలు కూడా ఇందుకోసం రావాలని ప్రయత్నిస్తున్నారు. కుంభమేళా తర్వాత వారందరితో కలిసి పోరాడుతాం. నేను హెచ్చరించిన నాటి నుంచి రాష్ట్రంలో ఆరు దేవాలయాలు ధ్వంసం అయ్యాయి. ఇది అడ్డుకోవడానికి రేవంత్ సర్కార్ ఏం చేయడం లేదు. దమ్ముంటే ఆపండి. ఎవరికోసం ఎదురు చూడకుండా ఆలయాలను మనం అందరం కలిసి కాపాడుకుందాం’ అంటూ భక్తులకు సూచించింది.

Also Read :  ఎవరీ హానీసింగ్..? ఆసక్తికరంగా నితిన్ 'రాబిన్ హుడ్' టీజర్

సనాతన ధర్మం జోలికి వస్తే..

ఇక ఇటీవల ఆర్టీవీతో మాట్లాడిన అఘోరీ..  సనాతన ధర్మం జోలికి వస్తే తాను సహించనని చెప్పింది. ఎక్కడ ఆడపిల్లకి అన్యాయం జరిగితే అక్కడ తానుంటానంది. తెలంగాణలో తనను అపే మగాడు ఇంకా పుట్టలేదని, తెలంగాణలో శివ తాండవం జరగబోతుందని తెలిపింది. పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారని.. అయితే ఆయన నుంచి తనకు ఎటువంటి సందేశం ఇంకా అందలేదని అఘోరీ చెప్పుకొచ్చింది.  

Also Read :  నడిరోడ్డుపై దారుణం.. తల్లీ కొడుకును నరికి చంపిన యువకుడు!

Also Read :  జ‌గ‌న్‌కు బిగ్ షాక్.. ఆ ఎన్నిక రద్దు చేసిన ఈసీ!

Advertisment
తాజా కథనాలు