Airports: తెలంగాణకు మరో మూడు ఎయిర్‌పోర్ట్‌లు.. ఎక్కడో తెలుసా?

తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్ట్‌లు కోసం సీఎం రేవంత్ రెడ్డి తనను కోరినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఖమ్మం, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాలో ఎయిర్ పోర్టుల నిర్మాణం కోసం భూసేకరణ చెప్పట్టాలని సీఎంకు సూచించినట్లు చెప్పారు.

airport
New Update

Telangana Airports : తెలంగాణ రాష్ట్రానికి మరికొన్ని విమానాశ్రయాలు రానున్నాయి. అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణలో కేవలం ఒకటే ఎయిర్ పోర్ట్ ఉంది. హైదరాబాద్ లో శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ఉంది. కాగా తెలంగాణలో ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఏవియేషన్ సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడుతో సమావేశం అయ్యారు. అలాగే కేంద్ర రక్షణశాఖ మంత్రితో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. 

Also Read : ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త!

మరో మూడు విమానాశ్రయాలు....

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఇప్పటికే వరంగల్ ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్ రాగ.. మరో మూడు ప్రాంతాల్లో ఎయిర్ పోర్టులు కావాలని సీఎం రేవంత్ రెడ్డి తనను కోరినట్లు చెప్పారు. ఖమ్మం, పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి తాము అనుకూలంగా ఉందని చెప్పారు. ఒక తెలుగు వ్యక్తిగా తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కొరకు కట్టుబడి పనిచేస్తానని అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, ఎయిర్ కనెక్టివిటీ కోసం కృషి చేయనున్నట్లు చెప్పారు.

Also Read :  ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?

అవసరమైన స్థలం రెడీ చేయండి....

సీఎం రేవంత్ రెడ్డి అడిగిన మూడు ప్రాంతాల్లో ఎయిర్ పోర్టులు నిర్మించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు. ఎయిర్ పోర్టుకు కావాల్సిన భూములను సమకూర్చాలని సీఎం రేవంత్ కు సూచించామని.. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా భూసేకరణ కోసం కార్యాచరణ చేపడుతామని సీఎం అన్నారని చెప్పారు. ఎంత త్వరగా భూసేకరణ అవుతే అంతే తొందరగా ఎయిర్ పోర్టు నిర్మాణానికి అడుగులు ముందుకు పడుతాయని అన్నారు. ఇప్పటికే వరంగల్ లో ఎయిర్ పోర్టుకు సంబంధించి కొంత ప్రభుత్వ భూమి ఉందని.. మరో సుమారు 254 ఎకరాల కోసం ప్రభుత్వం భూసేకరణ కార్యక్రమం చేపడుతుందని తెలిపారు. కాగా ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేసేందుకు రక్షణ శాఖ భూమి ఉందని.. ఆ భూమి కోసం సీఎం రేవంత్ రెడ్డి రక్షణ శాఖ మంత్రిని కూడా కోరినట్లు చెప్పారు. ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం రక్షణ శాఖతో కలిసి పనిచేస్తామని తెలిపారు.

Also Read :  ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం!

Also Read :  ఇస్లామాబాద్‌లో రణరంగం...ఇమ్రాన్‌ ను రిలీజ్ చేయాలంటూ గొడవ

#telangana #revanth-reddy #airports
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe