/rtv/media/media_files/2025/03/23/DFCbi4kecinb1xaa33kJ.jpg)
Betting Apps Case
Betting Apps Case : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. సెలబ్రిటీలుగా పేరు సొంతం చేసుకున్న ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్లు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ కేసులో ఇప్పటికి సోషల్ మీడియా ఇన్ఫ్యూలెన్సర్లతో పాటు టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉండగానే తెలంగాణలోని పలు జిల్లాల్లో బెట్టింగ్ వల్ల డబ్బులు పోగొట్టుకున్న యువకులు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో కొంతమంది టాలీవుడ్ స్టార్ హీరోల పై బెట్టింగ్ యాప్ప్ ప్రమోషన్ చేశారని వారిపై కూడా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తుండగా మరి కొందరు నేరుగా పోలీసులు ఆశ్రయించి ఫిర్యాదు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: లంచ్ బాక్స్‌లో ఏం పెట్టినా పిల్లలు తినడం లేదా.. ఇవి చేసిపెట్టండి, వద్దన్నా తింటారు
ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ హీరో అయిన నందమూరి బాలకృష్ణ , గోపీచంద్‌తో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులకు రామా రావు అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా.. స్టార్ హీరోలు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేయడంతో లక్షలాది మంది డబ్బు పోగొట్టుకున్నారని, మ్యూల్ ఖాతాల ద్వారా చైనీయులకు ఈ నగదు చేరిందని రామారావు ఆరోపించారు.
ఇది కూడా చదవండి: యూరిక్ యాసిడ్ పెరిగిందా..టాబ్లెట్స్‌కి బదులు ఇవి తీసుకోండి
అసలు విషయంలోకి వెళ్తే.. ఆహా ఓటీటీ వేదికగా బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 షోలో నటుడు గోపీచంద్, ప్రభాస్, బాలకృష్ణ సంయుక్తంగా ‘Fun88’ అనే చైనీస్ బెట్టింగ్ యాప్ ను సంయుక్తంగా ప్రమోట్ చేశారు అంటూ మారేడుపల్లి పోలీస్ స్టేషన్ లో రామారావు ఇమ్మనేని అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. లక్షలాది మందిని మోసం చేశారని, పైన పేర్కొన్న వ్యక్తులపై సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కూడా ఫిర్యాదుదారు పేర్కొనడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక దీనిపై వీరు ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇది కూడా చదవండి: ప్రాణాలు తీస్తున్న కలుషిత ఆహారం.. అందుకే వండిన వెంటనే తినేయాలి
ఇదిలా ఉండగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ప్రభాస్, బాలకృష్ణ పేరు సొంతం చేసుకోవడమే కాకుండా తమ సినిమాల ద్వారా వందల కోట్ల కలెక్షన్స్ వసూలు చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నారు. అంతేకాదు సినిమాల ద్వారా, యాడ్స్ ద్వారా పలు వ్యాపారాలలో కూడా పెట్టబడులు పెట్టి వేల కోట్ల రూపాయలను సొంతం చేసుకున్న వీరు.. ప్రజలకు మంచి చేకూర్చాలి కానీ మళ్ళీ డబ్బు కోసం ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఏంటి? వీరికి ఇదేం పోయేకాలం? అంటూ నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .వాస్తవానికి ప్రజలకు నష్టం వచ్చినా..కష్టం వచ్చినా ఆదుకోవడంలో అటు బాలకృష్ణ , ఇటు ప్రభాస్ ఇద్దరూ ముందుంటారు. అలాంటి వీరు వీటివల్ల ప్రజలు ఆర్థికంగా నష్టపోతారని తెలిసినా కూడా ఎందుకు ప్రమోట్ చేశారు అనే కోణంలో అభిమానులు సైతం ఆరా తీస్తున్నారు.
Also Read: ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్న కెనడా.. ఆ పార్టీ వైపే ఓటర్లు
సినీ నటుడు ఆలీ భార్య పేరు..
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో సినీ నటుడు అలీ సతీమణి జుబేదా తో పాటు బిగ్ బాస్ 4 ఫేమ్ యాంకర్ లాస్య ఉన్నట్లు తమకు అనుమానం కలుగుతోందని జనసేన విద్యార్థి విభాగం సంపత్ నాయక్ అన్నారు.. జుబేదా అలీ, లాస్య యూట్యూబ్ ఛానల్స్‌ను పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జుబేదా అలీ, లాస్యతో పాటు పలువురిపై మియాపూర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.. ప్రస్తుతం నటుడు ఆలీ భార్య జుబేదా పేరు వినిపిస్తుంది. పోలీసులు ఆమె యూట్యూబ్ ఛానల్ ని పరిశీలిస్తున్నారు. అలాంటి వీడియో లు ఉంటే కనుక వెంటనే ఆమెకు నోటీసులు పంపి అదుపులోకి తీసుకుంటామని చెప్తున్నారు. అటు లాస్య ఫై కూడా అనుమానం ఉండడంతో ఆమె యూట్యూబ్ ఛానల్ ఇంస్టాగ్రామ్ రీల్స్‌లో ఏవైనా బెట్టింగ్ యాప్స్ ఉన్నాయా అని పోలీసులు పరిశీలిస్తున్నారు.
Also Read: ప్రపంచంలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రీడ ఏదో తెలుసా..?