అల్లు అర్జున్ పై కేసు వెనక్కి.. శ్రీతేజ్ తండ్రి సంచలన ప్రెస్ మీట్!

అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తున్నారన్న వార్తలు రావడంతో సానుభూతితో కేసును వెనక్కు తీసుకుంటానన్నారు శ్రీతేజ్ తండ్రి భాస్కర్. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. బాబు కోలుకోవడానికి నెల నుంచి ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు చెప్పారన్నారు.

New Update

మైత్రీ మూవీస్ నుంచి రూ.25 లక్షలు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రూ.25 లక్షలు, అల్లు అర్జున్ నుంచి రూ.10 లక్షల డీడీ అందిందని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తెలిపారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అల్లు అర్జున్ టీం సభ్యులు ఘటన జరిగిన రెండో రోజు నుంచి స్పందన వచ్చిందన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అవుతారని తెలియడంతో సానుభూతితోనే కేసును వాపస్ తీసుకుంటానని చెప్పానన్నారు. అల్లు అర్జున్ వాళ్ల మేనేజర్లు నిత్యం వచ్చి వివరాలు తీసుకుంటున్నారన్నారు. బాబు నిన్నటి నుంచి కళ్లు తెరుస్తున్నాడన్నారు. కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారన్నారు. నెల నుంచి 6 నెలలు పట్టొచ్చని డాక్టర్లు చెబుతున్నారన్నారు. ఇప్పుడు ఐసీయూ నుంచి ప్రత్యేక గదిలోకి షిఫ్ట్ చేశారన్నారు. 
ఇది కూడా చదవండి: దమ్ముంటే పట్టుకోరా.. వివాదాస్పద సాంగ్ విడుదల చేసిన పుష్ప టీమ్!

ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్-సంధ్య థియేటర్ కేసు వ్యవహారంలో ఈ రోజు అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. చిక్కడపల్లి పోలీసులు దాదాపు 2 గంటల పాటు అల్లు అర్జున్ ను విచారించారు. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. మరో వైపు అల్లు అర్జున్ ప్రధాన బౌన్సర్ ఆంటోనీని అరెస్ట్ చేశారు. ఆంటోని ఘటన జరిగిన రోజు పోలీసులతో దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. తొక్కిసలాట జరగడానికి ఆయన ప్రధాన కారణమని గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆంటోనీ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. 
ఇది కూడా చదవండి: Allu arjun: అల్లు అర్జున్ విచారణ పూర్తి.. కీలక ప్రశ్నలకు సమాధానాలివే!

శ్రీతేజ్ ను పరామర్శించిన దిల్ రాజు

మరో వైపు తెలంగాణ ఫిల్మ్ డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఈ రోజు ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించారు. బాలుడి తండ్రి భాస్కర్ తో మాట్లాడారు. ప్రభుత్వానికి, సినిమాకు మధ్య వారధిగా ఉంటానన్నారు. అల్లు అర్జున్ ను కూడా కలుస్తానన్నారు. రేవతి భర్త భాస్కర్ ను ఇండస్ట్రీ కి తీసుకుని వచ్చి ఏదోక జాబ్ ఇచ్చేలా చూస్తామని భరోసానిచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు