BIG BREAKING: బన్నీ కోసం రంగంలో మామ.. కాంగ్రెస్ హైకమాండ్ తో భేటీ!

అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ నేత కంచర్ల భూపాల్ రెడ్డి ఈ రోజు గాంధీ భవన్ కు వెళ్లడం సంచలనంగా మారింది. పీసీసీ చీఫ్ తో పాటు, ఏఐసీసీ ఇన్ ఛార్జి మున్షీని ఆయన కలిశారు. అల్లు అర్జున్ పై కేసు తదనంతర పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.

New Update
Allu Arjun kancharla

Allu Arjun kancharla chandra Shekhar Reddy

అల్లు అర్జున్ వివాదం మరో కీలక మలుపు తీసుకుంది. అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కొద్ది సేపటి క్రితం గాంధీభవన్‌కు వెళ్లారు. ఏఐసీసీ ఇన్చార్జ్ దీప దాస్ మున్షీ, పీసీసీ చీఫ్‌ను కలిశారు. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే.. అల్లు అర్జున్ మామకు పీసీసీ చీఫ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మున్షి టైం ఇవ్వలేదన్న ప్రచారం కూడా మరో వైపు సాగుతోంది. దీంతో ఆయన నిరాశతో వెనుదిరారన్న వార్తలు కూడా వస్తున్నాయి. గత ఎన్నికల ముందు వరకు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ లో ఉన్నారు.

 

నల్గొండ నుంచి ఆయన ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే బీఆర్ఎస్ హైకమాండ్ అందుకు నో చెప్పడంతో ఆయన నిరాశకు గురయ్యారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరారు. దీప దాస్ మున్షి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. మల్కాజ్ గిరి నుంచి ఆయన ఎంపీ టికెట్ కోసం కూడా ప్రయత్నించారు. కానీ టికెట్ దక్కలేదు.

సాయం చేయడానికి సిద్ధం..

అయితే.. అల్లు అర్జున్ వ్యవహారం, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కలవడంపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. అల్లు అర్జున్ మామ ఏ సహాయం అడిగినా చేయడానికి సిద్ధమేనన్నారు. అల్లు అర్జున్ ఘటనపై ప్రతిపక్షాలు అనవసర రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ సభ్యుడేనన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు