Rain Alert : తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలే ..వర్షాలు!
తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు వానలు పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నట్లు వివరించింది.
తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు వానలు పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నట్లు వివరించింది.
కేటీఆర్ రోడ్ షో రాళ్ల దాడి ఘటనలో పోలీసులు బీజేపీ, హిందూ సంఘాలకు చెందిన 23 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో 15 మందిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదైంది . ఇటీవల ఖానాపూర్లో ఎన్నికల ప్రచారం చేస్తూ.. సమయం ముగినప్పటికీ ఇంకా ప్రచారం చేయడంతో ఆయనతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
భైంసాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయనకు వ్యతిరేకంగా ప్లకార్డులతో పలువురు నిరసన వ్యక్తం చేశారు. జన సమూహంలో నుంచి కొందరు విసిరిన ఉల్లిగడ్డలు, టమాటాలు ప్రచార వాహనం సమీపంలో పడగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన నీట్ పరీక్షలో పేపర్ మారడం కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా T3 GRIDU పేపర్ ఇవ్వగా.. ఆసిఫాబాద్లో N6 NANGU అనే పేపర్ ఇచ్చారు. ఈ పరీక్ష రాసిన 299 మంది విద్యార్థులు తమకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ప్రత్యేక అభిమానం ఉందని సీఎం రేవంత్ అన్నారు. జిల్లాను తాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ఆదివారం ఆదిలాబాద్ లో నిర్వహించిన సభలో హామీ ఇచ్చారు. బీజేపీకి ఓటు వేసి మరోసారి మోసపోవద్దన్నారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈరోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్మల్లోని జనజాతర సభలో పాల్గొననున్నారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఆదిలాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్ కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆయన ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. ఇంకా.. రూ.50 వేల జరిమానా కూడా విధించింది.
పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు ఆసిఫాబాద్ లో నిర్వహిస్తున్న బహిరంగ సభలో ఆయన పాల్గొంటున్నారు. సభ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.