Basara IIIT : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. బాసర ట్రిపుల్ఐటీ నోటిఫికేషన్ విడుదల బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్‌లో (IIIT) ప్రవేశాలకు సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. జూన్ 1 నుంచి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు జూన్ 22 లాస్ట్ డేట్ అని పేర్కొన్నారు. By B Aravind 27 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి IIIT Notification Released : బాసర (Basara) లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్‌లో (IIIT) ప్రవేశాలకు సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 1 నుంచి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు (Online Application) చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. మీ సేవ లేదా యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. Also Read: ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.. ఉన్నతాధికారులతో సీఎస్ శాంతి కుమారి సమీక్ష! జూన్ 22 దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ అని తెలిపారు. ఆరేళ్ల ఇంటిగ్రేడెట్ కోర్సుల్లో అడ్మిషన్ పొందితే.. రెండేళ్లు ఇంటర్‌తో పాటు నాలుగేళ్లు ఇంజినీరింగ్ కోర్సు చేయవచ్చు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ లేదా ఇమెయిల్ ([email protected]) ద్వారా సంప్రదించవచ్చు. Also Read: బయటి హోటళ్లలో తింటున్నారా .. అయితే జాగ్రత్త #telugu-news #online-application #basara-iiit మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి