Lok sabha: ఆదిలాబాద్ లో ఆ పార్టీదే హవా.. RTV సంచలన స్టడీ రిపోర్ట్! తెలంగాణ పార్లమెంటు ఫలితాలపై ఇప్పటికే RTV సంచలన రిపోర్ట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా జూన్ 4న తుది ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో నెలరోజుల క్రితం RTV ఇచ్చిన స్టడీ రిపోర్ట్ తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి..? దీనివల్ల ఫలితాల్లో ఏం మార్పు ఉండబోతుందో చూద్దాం. By srinivas 02 Jun 2024 in Latest News In Telugu ఆదిలాబాద్ New Update షేర్ చేయండి Adilabad: తెలంగాణ పార్లమెంటు ఫలితాలపై ఇప్పటికే RTV సంచలన రిపోర్ట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా జూన్ 4న తుది ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో శనివారం ఎగ్జిట్ పోల్స్ ఫలితాల అంచనాలు విడుదల చేశాయి. అయితే నెలరోజుల క్రితం RTV ఇచ్చిన స్టడీ రిపోర్ట్ తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి..? దీనివల్ల ఫలితాల్లో ఏం మార్పు ఉండబోతుందో చూద్దాం. బీజేపీకి అనుకూల ఫలితం.. ఆదిలాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్ధి ఆత్రం సుగుణ గెలుస్తారని పోలింగ్‌కు ముందు RTV స్టడీలో తేలింది. పోలింగ్ తర్వాత అక్కడ పరిస్థితి మారింది. బీజేపీ అభ్యర్ధి గోడం నగేష్‌కు మోదీ మేనియా బాగా కలిసొచ్చింది. నగేష్ వివాద రహితుడు, వ్యక్తిగతంగా మంచి పేరుంది. ఇక ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు గెలవడం కూడా కలిసొచ్చింది. అటు కాంగ్రెస్ అభ్యర్ధి ఆత్రం సుగుణ ఉద్యమకాలంలో బంజారాలపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని వైరల్ చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఆదివాసీల్లోని ప్రధాన తెగలు కూడా నగేష్ వైపే మొగ్గాయి. ఆదివాసీ తెగల్ని ఏకం చేసేందుకు సీతక్క ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోయారు. ఇక కాంగ్రెస్ హామీలపై అసంతృప్తి కూడా నగేష్‌కు ప్లస్ అయింది. కాంగ్రెస్ ఇంచార్జ్‌గా వచ్చిన సత్తు మల్లేష్... కాంగ్రెస్‌లో గ్రూపుల్ని ఏకం చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. దీంతో ఫలితం బీజేపీకి అనుకూలంగా మారింది. నరేంద్రమోదీ మేనియా.. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. మా ప్రీపోల్ సర్వే తర్వాత ఈ నియోజకవర్గాల్లో ఏం మార్పులు జరిగాయో ఒక్కసారి చూద్దాం. సిర్పూర్ సెగ్మెంట్‌లో బీజేపీ నుంచి పాల్వాయి హరీష్ ఎమ్మెల్యేగా గెలవడం ఆ పార్టీ ఎంపీ అభ్యర్ధికి కలిసొచ్చింది. బీజేపీ భారీ స్థాయిలో జాతీయ నాయకులతో సమావేశాలు నిర్వహించడం ప్లస్ అయింది. ఇక్కడ పెద్దసంఖ్యలో ఉన్న బెంగాలీ ఓటర్లు పూర్తిగా కమలం గుర్తుకే ఓటేశారని మా స్టడీలో తేలింది. మోదీ మేనియా కూడా కలిసొచ్చింది. ఆసిఫాబాద్.. ఆసిఫాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి కోవా లక్ష్మి గెలిచారు. అయితే లోక్‌సభకి వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. స్థానికంగా బలమైన నాయకత్వాన్ని పార్టీలోకి ఆకర్షించడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఇక్కడ ఎక్కువగా ఉండే బంజారాలని అకట్టుకోవడంలో బీజేపీ వ్యూహాలు పనిచేశాయి. దీనికి నరేంద్రమోదీ మేనియా కూడా తోడయింది. ఖానాపూర్.. ఖానాపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి వెడ్మా బొజ్జు గెలిచారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం సీన్ మారింది. కాంగ్రెస్‌లో వర్గపోరుని బీజేపీ క్యాష్ చేసుకుంది. కమలం గుర్తుని స్థానిక నాయకులు బలంగా ప్రజల్లోకి తీసకెళ్లారు. విద్యావంతుల్లో పెరిగిన మోదీ గ్రాఫ్ కూడా పనిచేసింది. ఓవరాల్‌గా ఈ సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌పై బీజేపీ పైచేయి కనిపించింది. ఆదిలాబాద్.. ఆదిలాబాద్ విషయానికొస్తే... అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్ధి పాయల్ శంకర్ గెలవడం కలిసొచ్చింది. మోదీ స్వయంగా బహిరంగసభలో పాల్గొని, ఆదిలాబాద్‌కు వరాలు కురిపించడంతో పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారింది. వరుసగా జాతీయ స్థాయి నాయకులతో సభలు పెట్టడంతో జనంలోకి బాగా వెళ్లింది బీజేపీ. మహారాష్ట్ర బోర్డర్ ఏరియాలో బీజేపీ బలంగా ఉండటం కూడా అడ్వాంటేజ్ అయింది. బోథ్.. బోథ్ అసెంబ్లీ సెగ్మెంట్‌కి వస్తే... అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్ధి అనిల్ జాదవ్ గెలిచారు. అయితే పార్లమెంట్ ఎన్నికలకి వచ్చేసరికి పరిస్థితి మారింది. ఎంపీ అభ్యర్ధి గోడం నగేష్ స్థానికుడు కావడం ఇక్కడ బీజేపీకి కలిసొచ్చింది. నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న ఆదివాసులు కూడా స్థానికుడైన నగేష్‌కే ఓటేసేందుకు మొగ్గు చూపారు. గతంలో కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఖర్చుపెట్టారు. తమ సిట్టింగ్ సీట్‌ని కాపాడుకునే లక్ష్యంతో BJP-RSS శ్రేణులు తీవ్రంగా ప్రచారం చేశారు. దీంతో చివరి నమిషంలో పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారింది. నిర్మల్.. ఇక నిర్మల్‌కి వెళ్తే... అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్ధి మహేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యే గెలిచి ఉండటం ప్లస్ అయింది. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వం ఉండటం అడ్వాంటేజ్ అయింది. అయోధ్య రామాలయ అంశం ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. బీఆర్‌ఎస్‌లో మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ఆ పార్టీకి మైనస్ అయినట్టు తెలుస్తోంది. ముథోల్.. ముథోల్‌లోనూ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి గెలవడం ఆ పార్టీకి కలిసొచ్చింది. మతపరంగా సెన్సిటివ్ ఏరియా అయిన భైంసా లాంటి చోట బీజేపీకి వన్‌సైడ్ ఓట్లు పడ్డాయి. హిందుత్వ ఎజెండాని జనంలోకి బలంగా తీసుకెళ్లడంలో బీజేపీ కార్యకర్తలు సక్సెస్ అయ్యారు. ఇక్కడ కూడా రామాలయ నిర్మాణం అంశం ప్రభావం చూపించినట్టు కనిపిస్తోంది. దీనికి మోదీ మేనియా కూడా తోడయింది. బీజేపీ అభ్యర్ధి నగేష్‌కు విజయావకాశాలు బాగా పెరిగినట్టు మా సర్వేలో తేలింది. బీజేపీ: 1. ఆదిలాబాద్ - బీజేపీ 2. నిజామాబాద్- బీజేపీ 3. కరీంనగర్- బీజేపీ 4. మెదక్ - బీజేపీ 5. చేవెళ్ల - బీజేపీ 6. మల్కాజ్ గిరి - బీజేపీ 7. మహబూబ్ నగర్ - బీజేపీ 8. జహిరాబాద్ - బీజేపీ 9. వరంగల్ - బీజేపీ 10. సికింద్రాబాద్ - బీజేపీ కాంగ్రెస్: 11. పెద్దపల్లి - కాంగ్రెస్ 12. మహబూబాబాద్ - కాంగ్రెస్ 13. ఖమ్మం - కాంగ్రెస్ 14. నల్గొండ - కాంగ్రెస్ 15. భువనగిరి - కాంగ్రెస్ 16. నాగర్ కర్నూల్ - కాంగ్రెస్ 17. హైదరాబాద్ - ఎంఐఎం #rtv #telangana-parliament #results మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి