/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/ACB-Raids.jpg)
అక్రమాలకు అడ్డాలుగా మారిన అనేక ఆర్టీఓ ఆఫీసులపై తెలంగాణ ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పలు ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ లోని పాతబస్తీ బండ్లగూడ, నాగోల్, మలక్ పేట్, ఖైరతాబాద్, అత్తాపూర్ పాటు నల్గొండ, మహబూబాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల ఆర్టీఏ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. నేరుగా వాహనదారుల నుంచి ఫిర్యాదులు తీసుకున్న అధికారులు.. ఏజెంట్లు, బ్రోకర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలోని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ ఆకస్మిక సోదాలు చేపట్టింది.
హైదరాబాద్ లోని పాతబస్తీ బండ్లగూడ, నాగోల్, మలక్ పెట్, ఖైరతాబాద్, అత్తాపూర్ పాటు నల్గొండ, మహబూబాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల ఆర్టీఏ కార్యాలయాల్లో… pic.twitter.com/19xv85kjMR
— Telugu Scribe (@TeluguScribe) May 28, 2024