Telangana: హమ్మయ్య చలి కాస్త తగ్గింది..పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో చలి కాస్త తగ్గుముఖం పట్టింది.హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో రానున్న మరో 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణలో చలి కాస్త తగ్గుముఖం పట్టింది.హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో రానున్న మరో 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదిలాబాద్ జిల్లాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న మూడ్రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు హెచ్చరించారు.
ఆదిలాబాద్ ఇచ్చోడ మండలంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కేశవపట్నంలోని పలు ఇళ్లలో అటవీ అధికారులు కార్డెన్‌సెర్చ్ నిర్వహించారు. అక్రమ దుంగలు,ఫర్నిచర్ గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకునే క్రమంలో గ్రామస్థులు దాడిచేశారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కి గాయాలయ్యాయి.
వరంగల్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. రుద్రగుడెం పరిసర గ్రామాల పంటపొలాల్లో పులి అడుగులు గుర్తించిన రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. టైగర్ తిరుగుతున్నట్లు నిర్ధారించిన నర్సంపేట రేంజ్ ఆఫీసర్ రవికిరణ్ ప్రజలను అప్రమత్తం చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీన పడిందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీలోని అన్ని పోర్టులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 65 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు తెలిపారు.
తెలంగాణలోని కుమ్రంభీం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కడుపునొప్పితో సాసిమెట్ట గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్రం పార్వతి(12) మృతి చెందింది. ఇటీవలే జ్వరం,కడుపునొప్పితో హాస్పిటల్లో చేరి డిశ్చార్జ్ అయింది. మళ్లీ కడుపునొప్పి తీవ్రమై విద్యార్థిని మృతి చెందింది.
తెలంగాణలో గ్రూప్-1 ఎగ్జామ్ కు సంబంధించి జీవో-29, ఇతర రిజర్వేషన్ల అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఫలితాలకు లైన్ క్లీయర్ అయ్యింది. అయితే.. అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది.
గత రెండు నెలలుగా ఆడ తోడుకోసం ఆడవులన్నీ జల్లెడపడుతూ సంచరిస్తున్న పెద్దపులి మార్గాన్ని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. మేటింగ్ కోసం ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చి ములుగు తాడ్వాయి అడవుల్లో తిష్టవేసినట్లు అటవీశాఖ రేంజ్ అధికారి సత్తయ్య వెల్లడించారు.
ఆదిలాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోశెట్టి అనే యువకుడు మానసిక దివ్యాంగురాలైన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలికను 3 గంటల పాటు ఇంట్లోనే బంధించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసి.. ఇంటికి నిప్పటించారు.