Adilabad Incident: మా ఇళ్ల మీదకే వస్తారా?.. అటవీ అధికారులపై ప్రజల దాడి!

ఆదిలాబాద్ ఇచ్చోడ మండలంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కేశవపట్నంలోని పలు ఇళ్లలో అటవీ అధికారులు కార్డెన్‌సెర్చ్ నిర్వహించారు. అక్రమ దుంగలు,ఫర్నిచర్ గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకునే క్రమంలో గ్రామస్థులు దాడిచేశారు. ఫారెస్ట్‌ బీట్ ఆఫీసర్‌కి గాయాలయ్యాయి.

New Update

తెలంగాణలో మరో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. మొన్న కొడంగల్‌లో ప్రభుత్వ అధికారులపై జరిగిన దాడి ఘటన మరువక ముందే ఇప్పుడు మరొకటి రాష్ట్రంలో చోటుచేసుకుంది. కార్డెన్ సెర్చ్‌కు వెళ్లిన ఫారెస్ట్ అధికారులపై ప్రజలు తిరగబడ్డారు. ఏకంగా వారిపై దాడి చేశారు. అక్కడితో ఆగకుండా అధికారుల వాహనాలను సైతం ధ్వంసం చేశారు. 

ఇది కూడా చూడండి: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో మార్పులు

కార్డెన్ సెర్చ్

సమాచారం అందుకున్న పోలీసు బలగాలు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నాయి. అనంతరం అధికారులపై దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడిదే రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కేశవపట్నం గ్రామంలో అటవీ అధికారులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.

ఇది కూడా చూడండి: ఇన్‌స్టాంట్ కాఫీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

 

రూ.10 లక్షల విలువైన

అక్రమ కలప నిల్వ చేశారన్న ముందస్తు ఇన్ఫర్మేషన్‌తో పలు ఇళ్లలో కలప దుంగలు, ఫర్నిచర్ గుర్తించారు. వాటి విలువ దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. అదే క్రమంలో ఆ కలప దుంగలను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నించారు. దీంతో వెంటనే గ్రామస్థులు అధికారులపై తిరగబడ్డారు.

ఇది కూడా చూడండి: SBIలో 14 వేల క్లర్క్ ఉద్యోగాలు.. మూడు రోజులే ఛాన్స్!

అధికారులపై దాడి

అక్కడితో ఆగకుండా ఫారెస్ట్ అధికారులపై దాడి చేశారు. రాళ్లు, కర్రలతో రెచ్చిపోయారు. ఈ దాడుల్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాదవ్ నౌశిలాల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇక అక్కడితో ఆగని ఆ గ్రామస్థులు అధికారుల వాహనాలను సైతం ధ్వంసం చేశారు. రెండు ప్రభుత్వ వెహికల్స్ అద్దాలు పగలగొట్టారు. వెంటనే సమచారం అందుకున్న పోలీసు బలగాలు ఆ గ్రామానికి చేరుకున్నాయి. అనంతరం అటవీశాఖ అధికారులపై దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ దాడి విషయాన్ని అటవీ అధికారులు గొప్యంగ ఉంచుతున్నట్లు తెలుస్తోంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు