ఫార్మ్‌హౌస్‌ వివాదం.. నోటీసులపై స్పందించిన అలీ

అలీ ఫామ్‌హౌజ్‌లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని వచ్చిన నోటీసులపై ఆయన స్పందించారు. ఒక కన్వెన్షన్ సెంటర్‌ కోసం నా స్థలం లీజుకు ఇచ్చానని తెలిపారు. ఈ నిర్మాణాలపై లీజుదారులే సమాధానాలు ఇస్తారని పేర్కొన్నారు.

New Update
ali

ప్రముఖ సినీ నటుడు అలీ ఫామ్‌హౌజ్‌లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆయనకు గ్రామ కార్యదర్శి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.  అయితే తాజాగా ఆ నోటీసులపై అలీ స్పందించారు. ఒక కన్వెన్షన్ సెంటర్‌ కోసం నా స్థలం లీజుకు ఇచ్చానని తెలిపారు. ఈ నిర్మాణాలపై లీజుదారులే సమాధానాలు ఇస్తారని పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలపై నవంబర్ 5న ఒక నోటీసు ఇవ్వగా.. 22న గ్రామ కార్యదర్శి శోభారాణి మరో నోటీసు ఇచ్చారు. ఫామ్‌హౌస్‌లో పనిచేసేవారికి ఈ నోటీసులు అందజేశారు.  

Also Read: పార్లమెంటు సమావేశాలకు ముందు ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

నిర్మాణాలు ఆపేయండి

ఇక వివరాల్లోకి వెళ్తే వికారాబాద్‌ జిల్లా నవాబుపేట్‌ మండలం ఎక్మామిడి గ్రామ పంచాయతి పరిధిలోని అలీకి ఒక ఫామ్‌హౌస్ ఉంది. అయితే ఆ ఫామ్‌హౌజ్‌లో పర్మిషన్ లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టారని గ్రామ పంచాయతీ తేల్చింది. ఈ నేపథ్యంలోనే అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టినందుకు విలేజ్ సెక్రటరీ అలీకి నోటీసులు పంపించారు. వెంటనే నిర్మాణాలు ఆపేయాలని సూచించారు. 

Also Read: వివాహిత అపహరణ..బంధీగా ఉంచి 14 రోజులుగా అత్యాచారం!

చర్యలు తప్పవు

గతంలో పంపిన నోటీసులకు అలీ స్పందించకపోవడంతోనే తాజాగా రెండోసారి నోటీసులు జారీ చేశారు. నిర్మాణాలకు సంబంధించి సర్టిఫికేట్లు సమర్పించి పర్మిషన్ తీసుకోవాలని సూచనలు చేశారు. లేకపోతే పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే దీనిపై అలీ తనకు సంబంధం లేదని.. లీజుదారులే చూసుకుంటారని చెప్పడం చర్చనీయాంశమవుతోంది.  కొన్నేళ్ల క్రితమే ఎక్మామిడి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 345లో ఉన్న దాదాపు 14 ఎకరాల వ్యవసాయ భూమిని అలీ కొనుగోలు చేశారు. ఆ భూమిలో అలీ వ్యవసాయం చేస్తున్నారు. స్థానిక కూలీలతో పలు పంటలు, పండ్ల తోటలు కూడా వేశారు. ఇక ఈ ఫామ్‌హౌస్ వ్యవహారం ఇంకా ఎలాంటి మలుపు తిరుగుతుందో అనేదానిపై ఆసక్తి నెలకొంది.

Also Read: విషాదం.. గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్మి ముగ్గురు మృతి

Also Read: పెట్రోల్, డిజీల్ వాహనాలకు రేవంత్ సర్కార్ భారీ షాక్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు