Breaking: ఫార్ములా ఈ- కార్ రేస్ కేసులో కేటీఆర్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. గచ్చిబౌలి ఓరియన్ విల్లాస్‌లోని కేటీఆర్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ రోజు ఉదయమే ఏసీబీ విచారణకు వెళ్లి కేటీఆర్ తిరిగొచ్చిన విషయం తెలిసిందే.
హాజరుకాకుండానే తిరిగి ఇంటికి..
ఈ మేరకు ఫార్ములా ఈ-రేస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ పై ఇటీవలే ఏసీబీ అధికారుల నోటీసులు జారీ చేశారు. దీంతో సోమవారం విచారణకు హాజరయ్యేందుకు వెళ్లిన కేటీఆర్ తన లాయర్లను లోనికి అనుమతించకపోవడంతో తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు. విచారణకు హాజరు కాకుండానే అక్కడి నుంచి వచ్చేశారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఇందులో భాగంగానే ఆ డ్రామా నడుస్తోందన్నారు. తాను లాయర్లను తెచ్చుకుంటే వాళ్లకు భయమెందుకని, తమ లాయర్లే లేకపోతే తాను ఇవ్వని స్టేట్‌మెంట్‌ను ఇచ్చినట్లుగా లీకులిస్తారని అన్నారు. పోలీసులపై నాకు నమ్మకం లేదు. అందుకే తన వెంట విచారణకు లాయర్లను అనుతించాలని ఏసీబీ అధికారులను కోరినట్లు చెప్పారు. ఇక ఏసీబీ అధికారులకు కేటీఆర్ రాతపూర్వకంగా స్టేట్ మెంట్ ఇవ్వగా.. ఆ లేఖలో ఏముందనేదానిపై ఆసక్తి నెలకొంది
అప్పటివరకు విచారణకు హాజరు కాలేను..
అయితే కేటీఆర్ ఇచ్చిన లేఖ ఆధారంగా ఏసీబీ మరోసారి నోటీసులు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. కేసు విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం కేటీఆర్ ఇచ్చిన లేఖపై న్యాయనిపుణులతో ఏసీబీ సంప్రదింపులు జరుపుతోంది.
ఇది కూడా చదవండి: Navodaya: నవోదయలో దారుణం.. బాలికలపై నలుగురు టీచర్లు లైంగిక దాడి!
మరోవైపు ఈ-కార్ రేసు నిర్వహించిన గ్రీన్ కో కంపెనీ బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో కోట్ల రూపాయల లబ్ధి చేకూరినట్లుగా ప్రభుత్వం ఆరోపిస్తోంది. గ్రీన్ కో అనుబంధ సంస్థనుంచి 41 సార్లు బాండ్లు కొనుగోలు చేశారని చెబుతున్నారు. కోటి రూపాయల చొప్పున 41 కోట్లు బాండ్ల రూపంలో చెల్లింపులు జరిగినట్లు ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: దారుణం.. 9 మంది జవాన్లు మృతి