ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు తీవ్ర దాడులకు పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రత బలగాల వాహనాన్ని మందుపాతరతో పేల్చారు. ఈ ఘటనలో 9 మంది జవాన్లు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అదనపు బలగాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులకు ఆస్పత్రికి తరించారు. జవాన్లు కూంబింగ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ పేలుడు జరిగింది. కుత్రు-బద్రే అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఈ దాడులకు తెగబడ్డారు.
Also Read: ఆర్మీ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి..47 మంది సైనికులు మృతి
ఇదిలాఉండగా.. గత కొంతకాలంగా ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్, సుకుమా జిల్లాలో మావోయిస్టుల ప్రాబల్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే భద్రత బలగాలు, మావోయిస్టుల మధ్య తరచూ కాల్పులు జరుగుతున్నాయి. తాజాగా 9 మంది జవాన్లు మృతి చెందడం కలకలం రేపుతోంది.
Also Read: భయపెడుతున్న HMPV.. భారత్‌లో మొత్తం 3 కేసులు
ఇదిలాఉండగా ఈ మధ్య దండకారణ్యంలో మావోయిస్టులు (నక్సలైట్లు) పిట్టల్లా రాలిపోతున్నారు. వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యం దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. 2026 మార్చి నాటికి భారత్‌లో నక్సలైట్లను పూర్తిగా నిర్మూలిస్తామని మోదీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. గత పదేళ్లుగా నక్సల్స్‌ను లేకుండా చేయాలని కేంద్రం ఎన్నో ఆపరేషన్లు చేపట్టింది. ముఖ్యంగా మావోయిస్టుల కంచుకోట అయిన ఛత్తీస్‌గఢ్‌ను ప్రత్యేకంగా టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే మావోయిస్టులు, భద్రత బలగాలకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో మావోలతో పాటు.. పలువురు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు.
ALso Read: పెరిగిన చలి.. రానున్న ఐదు రోజులు మరింత తీవ్రం అంటున్న అధికారులు