పదేళ్ళ సర్వీస్...2013లో ఉద్యోగంలో చేరాడు. కానీ అతని ఆస్తి విలువ మాత్రం 150 కోట్ల పైనే. ప్రభుత్వ ఉద్యోగా మజాకా అంటున్నారు ఇతన్ని చూసి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేశ్ కుమార్ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం 6గంటల నుంచి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిఖేశ్ బంధువులు, స్నేహితుల ఇళ్ళల్లో మొత్తం 30 చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో ఫాంహౌస్‌లతో పాటు భారీగా వ్యవసాయ భూములు, బిల్డింగ్‌లను గుర్తించారు. వీటితో పాటూ రాసుల కొద్దీ బంగారం కూడా దొరికిందని చెబుతున్నారు. ఇప్పటి వరకు గుర్తించిన ఏఈఈ ఆస్తులు దాదాపు రూ.150 కోట్లకుపైనే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
Also Read: జపాన్ లో 'లాపాటా లేడీస్' భారీ విజయం.. ఏకంగా షారుక్ , ప్రభాస్ ని వెనక్కి నెట్టేసిందిగా
ఆరు నెలల క్రితమే సస్పెండ్..
నిఖేశ్ ఆరు నెలల క్రితం సస్పెండ్ అయ్యారు. తన దగ్గరకు వచ్చిన ఓ వ్యక్తిని 2 లక్షలు లంచం అడిగారు. దీంతో బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో రంగారెడ్డి జిల్లా ఏఈ నిఖేశ్, ఈఈ బన్సీలాల్‌లు లంచం తీసుకున్నట్టుగా గుర్తించారు. వారిని వెంటనే అప్పుడే సస్పెండ్ చేశారు.
Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?
ఇది కూడా చూడండి: రైతు బంధు బంద్.. హరీష్ రావు ఫైర్!
జపాన్ లో 'లాపాటా లేడీస్' భారీ విజయం.. ఏకంగా షారుక్ , ప్రభాస్ ని వెనక్కి నెట్టేసిందిగా