/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Minor-Girl-Rape-Case.jpg)
ఈ మధ్య కాలంలో లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా చిన్నారులపై రోజు రోజుకూ అకృత్యాలు అధికమయ్యాయి. కొందరు కామంధులు లైంగిక దాడులతో చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్నారు. పక్కనే తిరుగుతూ.. మనతోనే ఉంటూ ప్రేమగా మాట్లాడి జాలి చూపిస్తుంటారు. ఆ తర్వాత రోజు రోజుకూ విచక్షణ కోల్పోయి జంతువుల్లా మారి ప్రవర్తిస్తున్నారు.
ఇది కూడా చూడండి: నేడు నగరంలో భారీ ఎయిర్ షో..ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు!
చిన్నా పెద్దా తేడా లేకుండా కామంతో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. అలాంటి కామాంధులపై ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా దారుణాలు ఆగడం లేదు.
తాజాగా అభం శుభం ఎరుగని 8ఏళ్ల చిన్నారిపై 36 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడటం సంచలనంగా మారింది. ఈ ఘటన మరెక్కడో కాదు తెలంగాణాలోనే జరిగింది.
ఇది కూడా చూడండి: తిరుమలలో రన్నింగ్ కారులో మంటలు..భయంతో భక్తులు పరుగులు
మాయ మాటలు చెప్పి అత్యాచారం
నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండలంలోని ఓ గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలిక తన ఇంటి దగ్గర ఆటుకుంటుంది. అదే సమయంలో అటువైపుగా వచ్చిన 36 ఏళ్ల బొమ్మెన సాగర్ ఆ చిన్నారిపై కన్నేసాడు. చుట్టూ ఎవరూ లేకపోవడంతో ఆ చిన్నారికి మాయ మాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు.
ఇది కూడా చూడండి: వందే భారత్ స్లీపర్ రైళ్లకు ముహుర్తం ఫిక్స్..ఈ మార్గంలోనే తొలి రైలు!
అక్కడ ఆ చిన్నారిపై అత్యాచారం చేసి పంపించేశాడు. దీంతో ఆ బాలిక ఏడ్చుకుంటూ ఇంటికెళ్లి జరిగిందంతా తన తల్లికి చెప్పింది. వెంటనే ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.