TG: తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ల కోసం 'మైత్రి ట్రాన్స్ క్లినిక్స్'

దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో 32 మైత్రి ట్రాన్స్ క్లినిక్స్ ప్రారంభమయ్యాయి.ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ మార్గ్, హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాల్లో సీఎం రేవంత్ పాల్గొని క్లినిక్స్ ప్రారంభించారు.

New Update
mytri

దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ల కోసం మైత్రిట్రాన్స్‌ క్లినిక్స్‌ ను తెలంగాణలో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 32 జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఈ క్లినిక్‌లను సోమవారం జరిగిన వైద్యఆరోగ్యశాఖ ప్రజాపాలన విజయోత్సవాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ తరహా క్లినిక్‌లు ఏర్పాటు చేయటం దేశంలోనే ఇది తొలిసారి కావటం మరో  విశేషం. వారంలో రెండు రోజులు అంటే మంగళ, గురువారాలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కేంద్రాల్లో సేవలు అందుబాటులో ఉంటాయి.

Also Read: Ap Rains: ఏపీపై ఫెంగల్‌  తుఫాన్ ఎఫెక్ట్‌.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

Transgenders Clinic

ఈ క్లినిక్‌లలో ట్రాన్స్‌జెండర్‌ హెల్త్‌కేర్‌పై పూర్తిస్థాయి శిక్షణ పొందిన ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఓ డాక్టర్, కౌన్సిలర్, కమ్యూనిటీ పర్సన్‌గా ఒక ట్రాన్స్‌జెండర్‌ క్లినిక్‌లలో అందుబాటులో ఉండనున్నారు. గడిచిన పదేళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, గత వైఫల్యాలను సరిదిద్దుకుంటూ ప్రజా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని క్లినిక్‌ల ప్రారంభం సందర్భంగా సీఎం రేవంత్ అన్నారు. 

Also Read: Actress: బీచ్‌లో యోగా చేస్తుండగా.. హీరోయిన్‌ ని లాక్కెళ్లిన రాకాసి అల!

రాష్ట్రంలో 16 నర్సింగ్ కాలేజీలు, 28 ప్రభుత్వ పారా మెడికల్ కాలేజీలను వేదిక నుంచి వర్చువల్‌గా సీఎం ప్రారంభించారు. ఈ తెలంగాణ సమాజమే మా కుటుంబం అని భావించి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోపే 50 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు పూర్తి చేయడం గురించి రేవంత్‌ ప్రస్తావించారు.

Also Read: Punjab:మాజీ డిప్యూటీ సీఎం కి టాయిలెట్లు కడిగే శిక్ష..ఎందుకో తెలుసా!

పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను పొలిటికల్ రిహాబిలిటేషన్ సెంటర్‌గా మార్చదల్చుకోలేదని... అదొక ఉన్నతమైన సంస్థ అని అన్నారు. అందుకే పూర్తిగా ప్రక్షాళన చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఏడాదిలో పేదల వైద్యానికి రికార్డు స్థాయిలో రూ.835 కోట్లు అందించామన్నారు. గత ప్రభుత్వం రూ.450 కోట్లు మించి ఖర్చు చేయలేదన్నారు. అధికారం చేపట్టిన ఏడాదిలోపే వైద్య ఆరోగ్యశాఖలో 14 వేలకు పైచిలుకు నియామకాలు పూర్తి చేయటమే కాకుండా ఆరోగ్య తెలంగాణగా మార్చడానికి సంబంధిత శాఖ మంత్రి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని అభినందించారు.

Also Read: Chennai: కొండ చరియలు విరిగిపడి ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు