Kaleswaram : కాళేశ్వరంపై నిపుణుల కమిటీ .. మూడు బ్యారేజీలపై లోతుగా అధ్యయనం..!!
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నాణ్యతపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బ్యారేజీల పటిష్టత, కుంగిపోయిన పిల్లర్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో లోతుగా సంపూర్ణంగా అధ్యయనం చేయాలని ఆదేశించారు.