Telangana High Court: రూ.500 కోట్లు ఎలా ఖర్చు చేశారు..?.. ప్రభుత్వాన్ని నివేదిక కోరిన హైకోర్టు
ఆ రూ.500 కోట్లు ఎలా ఖర్చు చేశారు?.. అంటువ్యాధులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు..?.. మృతులకు ఎంత నష్ట పరిహారం చెల్లించారు..? అని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో వరదలు, వర్షాలపై రెండో సారి నివేదికను ప్రభుత్వం హైకోర్టుకు అందజేసింది. దీంతో ధాఖలైన పిల్‌ను విచారించిన హైకోర్టు సమగ్ర నివేదికను కోరింది.