పురుషులకు నెలసరి వస్తే తెలిసేది.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

మహిళా న్యాయాధికారులను విధుల నుంచి తొలగించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పురుషులకు నెలసరి వస్తే తెలిసేదంటూ ఘాటుగా విమర్శించింది. ఇంతకి ఏం జరిగిందో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే.

New Update
SC

మహిళా న్యాయాధికారులను విధుల నుంచి తొలగించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పురుషులకు నెలసరి వస్తే తెలిసేదంటూ ఘాటుగా విమర్శించింది. గర్భస్రావం(అబార్షన్) కారణంగా ఓ మహిళా న్యాయమూర్తి ఎదుర్కొన్న మానసిక, శారీరక క్షోభను మధ్యప్రదేశ్ హైకోర్టు విస్మరించిందని తెలిపింది. మహిళా సివిల్ జడ్జీల తొలగింపుపై వివరణ ఇవ్వాలంటూ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆశించిన స్థాయిలో పనితీరు కనబర్చలేదనే కారణంతో గతేడాది మధ్యప్రదేశ్ హైకోర్టు ఆరుగురు సివిల్ జడ్జిలను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 

Also Read: మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశం

ఇందులో నలుగురిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఫుల్ బెంచ్ నిర్ణయించింది. మిగతా ఇద్దరికి మాత్రం ఈ అవకాశం రాలేదు. ఇందులో ఓ జడ్జి తనకు గర్భస్రావం కావడంతో పాటు తన సోదరుడు క్యాన్సర్ బారినపడ్డట్లు హైకోర్టుకు వివరణ ఇచ్చింది. కానీ ఫలితం కనిపించలేదు. దీంతో ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న పలు కీలక వ్యాఖ్యలు చేశారు.   

Also Read: ఫడ్నవీస్ కే పట్టం.. ఆయనను మళ్లీ సీఎం చేసిన 6 ముఖ్య కారణాలివే!

'' ఆ జడ్జికి (అబార్షన్) జరిగింది. ఇలాంటి మహిళ మానసిక, శారీరకంగా ఎంతో వేదనకు గురయ్యే ఛాన్స్ ఉంటుంది. పరుషులకు నెలసరి వస్తే ఈ సమస్య ఏంటీ అనేది తెలిసేదని'' జస్టిస్ బీవీ నాగరత్న అన్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకోకుండా కేవలం పనితీరు ఆధారంగా తొలగించేలా నిర్ణయం తీసుకున్న మధ్యప్రదేశ్ హైకోర్టు తీరును తప్పుబట్టారు. ఇలాంటి ప్రమాణాలు పురుష న్యాయమూర్తలకు కూడా ఉండాలని ఆశిస్తున్నాని పేర్కొన్నారు. 

Also Read: కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే భూకంపం: భూగర్భ శాస్త్రవేత్త

Also Read: 96 రకాల సీతాకోకచిలక జాతులు గుర్తింపు.. ఆ రాష్ట్రంలో గ్రాండ్‌గా ఈవెంట్

 

Advertisment
Advertisment
తాజా కథనాలు