BIG BREAKING: ‘పుష్ప2’ ప్రీమియర్‌కు ముందు పోలీసుల లాఠీ ఛార్జ్!

నటుడు అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప 2’ చిత్రం ప్రీమియర్‌ షోకు ముందు హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌కి అభిమానులు భారీగా తరలివచ్చారు. జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు.

New Update
pushpa 2 (6)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షోలు గ్రాండ్ లెవెల్లో మరికొద్ది నిమిషాల్లో పడనున్నాయి. ఈ సినిమా చూసేందుకు యావత్ ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ప్రీమియర్ షోలు ఇవాళ రాత్రి 9.30 గంటలకు అంటే మరికొద్ది నిమిషాల్లో ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో టికెట్లు బుకింగ్ చేసుకున్న అభిమానులు, ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. 

Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?

ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ అయితే పరుగులే పరుగులు అని చెప్పాలి. ఇందులో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రియులు థియేటర్లకు చేరుకున్నారు. దీంతో థియేటర్ల వద్ద గందరగోళం ఏర్పడింది. అదే సమయంలో థియేటర్ల వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా ఆపేందుకు పోలీసులు సైతం భారీ బందోబస్తుతో అక్కడకు చేరుకున్నారు. 

Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..! 

థియేటర్ వద్ద లాఠీ ఛార్జ్

ఇక ఏది అయితే జరగకూడదు అని అనుకున్నారో సరిగ్గా అదే జరిగింది. ఓ థియేటర్ వద్ద గందరగోళం జరిగింది. దీంతో వాటిని అదుపు చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జ్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. మరి ఆ లాఠీ ఛార్జ్ ఎందుకు జరిగింది.. ఎక్కడ జరిగింది.. ఏ థియేటర్ వద్ద జరిగింది అనే విషయానికొస్తే.. 

Also Read:  ఫడ్నవీస్ కే పట్టం.. ఆయనను మళ్లీ సీఎం చేసిన 6 ముఖ్య కారణాలివే!

హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద ఈ లాఠీ ఛార్జ్ జరిగింది. అయితే ఈ ప్రీమియర్ షో చూసేందుకు బన్నీ తన ఫ్యామిలీతో ఆ థియేటర్‌కు వస్తాడని టాక్ వినిపించింది. దీంతో బన్నీని చూసేందుకు అభిమానులు భారీగా అక్కడకి తరలివచ్చారు. దీంతో థియేటర్ వద్ద గందరగోళం ఏర్పడింది. ఏం చేయాలో తెలియక జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

Also Read: ఫడ్నవీస్ కే పట్టం.. ఆయనను మళ్లీ సీఎం చేసిన 6 ముఖ్య కారణాలివే!

Advertisment
Advertisment
తాజా కథనాలు