Damagundam Forest: దామగుండం అడవిలో అగ్నిప్రమాదం.. అధికారులా పనేనా !

వికారాబాద్‌ జిల్లాలోని దామగుండం అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి మంటలు చెలరేగాయి. అయితే ఇది అగ్నిప్రమాదమా ? లేదా ఉద్దేశపూర్వకంగానే ఎవరైనా తగలబెట్టారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే నేవీ రాడర్ కేంద్రం కోసం అధికారులే ఈ పనికి పాల్పడ్డారని తెలుస్తోంది.

New Update
Forest

వికారాబాద్‌ జిల్లాలోని దామగుండం(Damagundam) అటవీ ప్రాంతంలో నేవీ రాడర్‌ కేంద్రం ఏర్పాటుచేసేందుకు ముందడుగులు పడుతున్నాయి. అయితే గురువారం రాత్రి అక్కడ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 20 నుంచి 30 ఎకరాల వరకు అడవి కాలిపోయింది. అయితే ఇది ప్రమాదమా ? లేదా ఉద్దేశపూర్వకంగానే ఎవరైనా తగలబెట్టారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే అక్కడుండే స్థానికులు మాత్రం.. అధికారులే ఈ పనికి పాల్పడ్డారని చెబుతున్నారు. నేవి రాడర్ కేంద్రం కోసం అడవిని తగలబెట్టారని అంటున్నారు.

Also Read: పంజా విసురుతున్న చలి.. రోజుకు 30-40 న్యూమోనియా కేసులు

పూడురు మండల పరిధిలోని మొత్తం 2,900 ఎకరాల వరకు దామగుండం అడవి విస్తరించి ఉంది. ఇటీవలే ఈ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేవీ రాడర్ కేంద్రం ఏర్పాటుకు కేటాయించింది. దీనికి భూమి పూజ కూడా జరిగింది. ప్రస్తుతం అడవి చుట్టూ రోడ్డు, ప్రహారీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే గురువారం రాత్రి అడవిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వందూరుతండా సమీపంలో ఈ మంటలు ఎగిసిపడగా.. అక్కడి స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. కానీ ఫైరింజన్ వచ్చే లోపలే దాదాపు 20 నుంచి 30 ఎకరాల అడవి కాలిపోయింది. 

Also Read: ఆర్ఎస్ ప్రవీణ్ చేయించారు.. కొండా సురేఖ సంచలనం!

వాస్తవానికి ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఉండే రైతులు,కాపరులు మేకలు, గేదెలు మేపుకుంటారు. రాడర్ స్టేషన్ కోసం భూమి పూజ చేసిన స్థలానికి ఎదురుగా వాహనాలు నిలిపేందుకు ఏర్పాటు చేసిన పార్కింగ్‌ సమీపంలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగిన వీడియోను అక్కడ స్థానికంగా ఉండే సత్యానందస్వామి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో వైరల్ అవ్వడంతో అధికారులు స్పందించారు. జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్, ఎఫ్‌ఆర్‌ఓ శ్యామ్‌కుమార్, నేవీ అధికారి మల్లికార్జున రావు తదితరులు ఆ స్వామి ఉంటున్న ఆశ్రమానికి వెళ్లి మాట్లాడారు. ఇదిలాఉండగా మరోవైపు దామగుండం అడవిలో నావీ రాడర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయొద్దని.. దీనివల్ల పర్యావరణానికి నష్టం కలుగుతోందనే విమర్శలు వస్తున్నాయి.  

Also Read: డిప్యూటీ సీఎం నాకొద్దు.. అలిగి సొంతూరు వెళ్లిపోయిన షిండే.. బిగ్ ట్విస్ట్!

Also Read: కుమురంభీంలో విషాదం.. పులి పంజాకు యువతి బలి

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు