/rtv/media/media_files/2025/01/07/hmpvvirus2.jpeg)
HMPV virus Photograph: (HMPV virus )
ఇటీవల చైనాలో బయటపడ్డ హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV) మరోసారి ప్రపంచ దేశాలను వణికించిన సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా వీటి కేసులు వివిధ దేశాల్లో పెరుగుతున్నాయని ముఖ్యంగా చైనాలో ఎక్కువగా నమోదైనట్లు వార్తలు వచ్చాయి. భారత్‌లో కూడా పలు కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్‌పై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో చైనా ఆరోగ్యశాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఉత్తర ప్రాంతంలో HMPV కేసులు తగ్గుముఖం పడుతున్నాయని పేర్కొన్నారు.
Also Read: ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలేంటో తెలుసా ?
HMPV కొత్త వైరస్ కాదు. నిర్ధరణ పరీక్షలు అందుబాటులోకి తీసుకురావడంతో గత కొంతకాలంగా ఈ కేసులు పెరిగాయి. పాజిటివ్ కేసుల్లో హెచ్చుతగ్గులున్నాయి. ప్రస్తుతం ఉత్తర చైనాలో ఈ కేసుల సంఖ్య తగ్గుతోంది. 14 ఏళ్లు, అంతకన్నా తక్కువ వయసున్నవారిలో పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. చైనాలో ఇప్పుడు వ్యాప్తిలో ఉన్న శ్వాసకోశ వ్యాధులో.. ఇప్పటికే తెలిసిన వ్యాధికారకాల వల్లే సంభవిస్తున్నాయి. కొత్తగా అంటు వ్యాధులు బయటపడలేదని'' చైనా సీడీసీ పరిశోధకురాలు వాంగ్ లిపింగ్ చెప్పారు.
Also Read: ఢిల్లీ ఎన్నికల్లో కీలక పరిణామం.. బరిలోకి దిగనున్న ఎన్సీపీ
అలాగే చైనాలో క్లినిక్‌లు, ఎమర్జెన్సీ విభాగాల్లో జ్వరం సంబంధిత రోగుల సంఖ్య పెరుగుతోందని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ మెడికల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ గావో జిన్‌కియాంగ్ తెలిపారు. కానీ గతేడాదీతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువేనన్నారు. జనవరి చివరినాటికి ఈ ఫ్లూ ఇన్‌ఫెక్షన్లు తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉందని కమిషన్ ప్రతినిధి హు కియాంగ్‌కియాంగ్ పేర్కొన్నారు. మరోవైపు భారత్‌లో ఇప్పటివరకు 13 HMPV కేసులు నమోదయ్యాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు.
Also read: రేపటి నుంచి మహాకుంభమేళ ఉత్సవాలు.. మొదటి రాజ స్నానం ఎప్పుడు చేయాలి? శుభ సమయం ఏంటి?