ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. ఇల్లువదిలి వెళ్లిపోయిన 17ఏళ్ల బాలిక, చివరికి..! మియాపూర్ టీఎన్‌నగర్‌కు చెందిన 17ఏళ్ల బాలిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఉప్పుగూడకు చెందిన 22ఏళ్ల విఘ్నేశ్‌తో ప్రేమలో పడింది. అతడి కోసం ఇల్లు వదిలి వెళ్లింది. ఆపై ఆ యువకుడు అత్యాచారం చేశాడు. పెళ్లి చేసుకోమంటే కోపంతో ఆమెను చంపేశాడు. ఎవరూ లేని ప్రాంతంలో పడేశాడు. By Seetha Ram 20 Nov 2024 in తెలంగాణ క్రైం New Update షేర్ చేయండి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అందులోనూ ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్ వినియోగం. అదే సమయంలో పలువురు సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. ఇన్‌స్టాలో పరిచయమై.. ఆ తర్వాత డీప్ లవ్‌లోకి జారుతున్నారు. అక్కడితో ఆగకుండా శారీరకంగానూ దగ్గరవుతున్నారు. ఆపై పెళ్లి మాట ఎత్తడంతో దారుణానికి పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్‌లోని మియాపూర్‌లో జరిగింది. Also Read: తిరుపతి ముంతాజ్ హోటల్స్‌ను రద్దు చేస్తారా? టీటీడీ ఛైర్మన్ ఏమన్నారు? ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం మియాపూర్ టీఎన్‌నగర్‌కు చెందిన 17ఏళ్ల బాలిక ఇంటర్ కంప్లీట్ చేసి ఇంటి దగ్గరే ఉంటోంది. అదే సమయంలో ఏడు నెలల క్రితం ఉప్పుగూడకు చెందిన బ్యాండ్ వాయించే 22 ఏళ్ల విఘ్నేశ్ (చింటూ)తో ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లు ఫ్రెండ్స్‌గానే మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. Also Read: విడిపోతున్న రెహమాన్ దంపతులు..ప్రకటించిన భార్య సైరా దీంతో ఆమె విఘ్నేశ్ వలలో పడిపోయింది. అక్టోబర్ 20న ఇళ్లు వదిలి అతడి కోసం వెళ్లిపోయింది. అనంతరం ఎక్కడ ఉండాలో తెలియక.. విఘ్నేశ్ స్నేహితుడు అయిన మీర్‌పేటకు చెందిన సాకేత్.. ఛత్రానాకలోని హనుమాన్ నగర్‌లో ఉండటంతో అక్కడికి వెళ్లిపోయారు. అయితే సాకేత్‌కు వివాహం కావడంతో వారు చిన్న ఇంటిలో ఉంటున్నారు. ఇక ఇప్పుడు నలుగురు అవ్వడంతో ఆ ఇళ్లు సరిపోలేదు. దీంతో ఈ నలుగురూ కలిసి మీర్‌పేటలోని శ్రీదత్తనగర్‌లో కొంచెం పెద్ద ఇంటిలో అద్దెకు దిగారు. అదే సమయంలో ఆ బాలిక తన ఇంటికి ఫోన్ చేసి తాను ఫ్రెండ్స్‌తో ఉంటున్నానని తెలిపింది. ఇక పెద్ద ఇల్లు కావడంతో అంతా హ్యాపీగా ఉన్నారు. విఘ్నేశ్ ఆ బాలికని పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆ రూమ్‌లోనే దండలు మార్చుకున్నారు. Also Read: మరో విషాదం.. అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి అయితే ఇలా కాదని.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామని ఆ బాలిక చెప్పడంతో సరే సరే అంటూ విఘ్నేశ్ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో ఆ బాలిక ఇన్‌స్టాలో మరొకరితో మాట్లాడుతుందని అనుమానించిన విఘ్నేశ్ ఈ నెల 8న గొడవ పడ్డాడు. ఆ గొడవలో ఆ బాలిక తలను గోడకేసి కొట్టాడు. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే చనిపోయింది. దీంతో విఘ్నేశ్, తన ఫ్రెండ్ సాకేత్‌తో కలిసి బైక్‌పై తుక్కుగూడ సమీపంలోని ప్లాస్టిక్ వ్యర్థాల తుక్కులో మృతదేహాన్ని పడేశారు. Also Read: USA: అమెరికాకు పొంచి ఉన్న ముప్పు..దూసుకొస్తున్న బాంబ్ సైక్లోన్ అనంతరం ఏమీ ఎరుగనట్లు వెళ్లిపోయారు. ఆ బాలిక రోజు తమ తల్లితో మాట్లాడేది. కానీ ఓ మూడు రోజుల నుంచి ఫోన్ చేయలేదు. అదే సమయంలో విఘ్నేశ్ ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆ బాలిక తన వద్దకు రాలేదని.. మీ ఇంటికి వచ్చిందా? అని అడిగాడు. దీంతో వారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విఘ్నేశ్‌ను పోలీసులు విచారించగా హత్యచేసినట్లు ఒప్పుకున్నాడు. విఘ్నేశ్‌తో పాటు అతడికి సహకరించిన సాకేత్, అతడి భార్య కల్యాణిని పోలీసులు అరెస్ట్ చేశారు. #17years old girl #instagram #miyapur #telangana crime news #crime-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి