TTD:తిరుపతి ముంతాజ్ హోటల్స్‌ను రద్దు చేస్తారా?టీటీడీ ఛైర్మన్ ఏమన్నారు?

తిరుపతిలో 2014 నుంచి వార్తల్లో ఉంటున్న విషమం ముంతాజ్ హోటల్స్.  అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంజూరు అయిన ఈ ప్రాజెక్టు ప్రభుత్వాలు మారడడం వలన వివాదాల్లో ఇరుక్కుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని రద్దు చేయాలని తీర్మానించామని చెబుతున్నారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. 

author-image
By Manogna alamuru
New Update
11

 Mumtaz Hotels contraversy: 

హిందువుల అతి పెద్ద పవిత్ర స్థలమైన తిరుపతిలో ముంతాజ్ హోటల్స్ నిర్మాణం చేస్తున్నారు. 20 ఎకరాల్లో  దీనిని నిర్మిస్తున్నారు. తిరుమలకు వెళ్లే మార్గంలో అలిపిరి సమీపంలో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. అయితే దీనిపై అక్కడి  ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. హిందువుల మనోభావాలకు విరుద్ధంగా అలిపిరి జూపార్క్‌ రోడ్డులో కడుతున్న ముంతాజ్‌ హోటల్‌కు ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  తిరుక్షేత్రాల రక్షణ సమితి, రాయల్‌ పీపుల్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడు తుమ్మా ఓంకార్‌, రెడ్డి శేఖర్‌ రాయల్‌, సనాతన ధర్మ పరిరక్షణ సమితి నాయకులు దీనిపై ఎప్పటి నుంచో నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
 
 తాజాగా దీనిపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. ముంతాజ్ హోటల్స్ నిర్మాణాన్ని రద్దు చేయాలని తీర్మానించినట్లు ఆయన తెలిపారు.  టీటీడీ పాలకమండలి సమావేశంలో కూడా దీన్ని ఆమోదించామని చెప్పారు. ముంతాజ్ హోటల్స్‌కు కేటాయించిన స్థలం లీజును వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోన్నామని చెప్పారు. ఈ మేరకు టీటీడీ పాలక మండలి ఆమోదించిన తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. ఆ స్థలాన్ని మళ్లీ టీటీడీకే అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరనున్నామని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.

అసలేంటీ నిర్మాణం..

2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం దేవలోకం అనే పేరుతో తిరుపతిలోని అలిపిరి దగ్గరలో ఓ భారీ పర్యాటక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దీని కోసం 60 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ప్ర‌భుత్వ భూమిని దేవ‌లోకం ప్రాజెక్టు కోసం టూరిజం శాఖ‌కు అప్ప‌గించింది. అయితే 2019 తర్వాత ప్రభుత్వం మారింది. దాంతో ప్రాజెక్టు కూడా మారింది.అయితే గ‌త ప్ర‌భుత్వం ఆ ఒప్పందాన్ని ర‌ద్దు చేసి.. 60 ఎకరాల్లో 20 ఎకరాలను వైసీపీ ప్రభుత్వం ఓబెరాయ్ గ్రూప్స్ చేతుల్లో పెట్టింది. ముంతాజ్ హోటల్స్ అంటూ కొత్త నిర్మాణాన్ని చేపట్టింది. ఈ 20 ఎకరాల్లో వంద విల్లాలను నిర్మించాలని ప్లాన్ చేసింది. అయితే దీనిపై మొదటి నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. హోటల్స్ నిర్మించి అక్కడ మద్యం, మాంసం లాంటివి సప్లై చేయడమే కాకుండా..తిరుమల పవిత్రతకు వ్యతిరేక కార్యకలాపాలు నిర్వర్తిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఇదేమీ పట్టించుకోలేదు. హోటల్స్ నిర్మాణాన్ని కంటిన్యూ చేసింది.

కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. మళ్ళీ టీడీపీతో కూటమి ప్రభుత్వం వచ్చింది.  టీటీడీ ఛైర్మన్ మారారు. దీంతో ఈ వివాదం మళ్ళీ తెర మీదకు వచ్చింది.  దీంతో ముంతాజ్ హోటల్స్ నిర్మాణం రద్దు చేయాంటూ డిమాండ్ పెరిగింది. దీన్ని పరిగణనలోకి తీసకున్న టీటీడీ పాలక మండలి ఇటీవల జరిగిన మీటింగ్‌లో నిర్ణయం తీసుకుంది. ఆ స్థ‌లం ఆల‌యానికి స‌మీపంలో ఉంటుంద‌ని, హిందువుల‌ను మ‌నోభావాల‌కు వ్య‌తిరేకమ‌ని, అందుకే పాల‌క‌మండలి స‌మావేశంలో హోల్స్‌కు ఇచ్చిన భూమి లీజు ర‌ద్దు కోరుతూ తీర్మానం చేశామ‌ని, ఆ భూమిని ఆల‌యానికి అప్ప‌గిస్తామ‌ని టీటీడీ చైర్మెన్ బీఆర్ నాయుడు తెలిపారు.

Also Read: విడిపోతున్న రెహమాన్ దంపతులు..ప్రకటించిన భార్య సైరా

Advertisment
Advertisment
తాజా కథనాలు