Weather Alert : రాష్ట్రంలో పెరుగుతోన్న చలి.. వాతావరణ శాఖ కీలక ప్రకటన తెలంగాణలో చలితీవ్రత పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో అత్యల్పంగా 12.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 12.8, పటాన్‌చెరు 13.2, ఆదిలాబాద్‌లో 13.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండు మూడురోజులు చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. By B Aravind 13 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Hyderabad Weather Forecast : తెలంగాణ(Telangana) లో ఉష్ణోగ్రతలు పడిపోవండంతో చలి తీవ్రత పెరిగిపోయింది. అందరూ తమ స్వెట్టర్లు తీస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే వేడి కోసం చలి మంటలు కాచుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో అత్యంత తక్కువగా చలి తీవ్రత నమోదైంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో అత్యల్పంగా 12.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 12.8, పటాన్‌చెరు 13.2, ఆదిలాబాద్‌లో 13.7, అలాగే రామగుండంలో 14.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరో విషయం ఏంటంటే.. వచ్చే రెండు మూడు రోజులు చలి తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Weather Forecast) హెచ్చరిచ్చింది. ఆ రోజుల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరిగి ఆ తర్వాత సాధారణ స్థితికి వచ్చే అవకాశాలున్నాయని పేర్కొంది. అలాగే డిసెంబర్ చివరి వారం మళ్లీ చలి తీవ్రత పెరుగుతుందని వెల్లడించింది. Also Read: టిఎస్‌పిఎస్‌సి ప్రక్షాళన.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. #telugu-news #telangana-news #hyderabad #weather-forecast #weather-alert #winter మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి