ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, పలు కీలక అంశాలపై చర్చ

తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని నెలల గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడం, ఇవే చివరి కీలక సుదీర్ఘ సమావేశం కావడంతో అధికార ప్రతిపక్ష నేతల విమర్శలు, ప్రతివిమర్శలతో అసెంబ్లీ దద్దరిల్లనుంది. ప్రతిపక్ష నేతల మాటల తూటాలను సీఎం సైతం ఎదుర్కొనేందుకు అన్నివిధాలుగా సన్నద్ధం అయ్యారు. ఈనెల సోమవారం (31-07-2023) రోజున కేబినేట్ భేటీ కానుంది. ఇక వరదలు, మెడికల్‌ కాలేజీలకు సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించనున్నారు. ఇవే ప్రధాన అస్త్రాలుగా ప్రతిపక్షనేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఇరుకున పెట్టేందుకు సన్నద్దమయ్యారు.

New Update
ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, పలు కీలక అంశాలపై చర్చ

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly meeting ) ఆగస్టు 3 నుంచి జరగనున్నాయి.అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు బీఏసీ మీటింగ్ నిర్వహించనున్నారు. కొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇవే చివరి అసెంబ్లీ కీలక సమావేశాలు కానున్నాయి. దీంతో నేతల్లో ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో ప్రధాన ప్రతిపక్షాలు బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వరదలే అస్త్రం కానున్నాయి. అంతేకాకుండా గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేసింది. ఇకముందు ఏం చేయబోతోందన్న దానిపై సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాకుండా కొత్తగా ప్రవేశపెట్టబోయే పథకాలను (Schemes) కూడా ప్రకటించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈనెల 31న కేబినేట్ భేటీ కానుంది. ఇక గతంలో బీఆర్‌ఎస్ రెండు బిల్లులను గవర్నర్ రిజెక్ట్ చేసిన సవరణ బిల్లు కూడా అందులో మెయిన్‌గా (Main) ఉండబోతోంది.

గవర్నర్ తిరస్కరించిన రెండుబిల్లులపై  చర్చ

ఈ బిల్లులో ఎక్స్ అఫిషియల్‌గా ఎందుకు ఇవ్వాలంటూ గవర్నర్ (Governor) ఈ బిల్లులను రిజెక్ట్ (Bills Reject) చేయడం జరిగింది. మైనార్టీలకే ఎందుకు ఇవ్వాలంటూ ఆమె ఈ బిల్లును ఆమోదించలేదు. మళ్లీ అదే బిల్లును అసెంబ్లీలో చర్చించి అదే బిల్లును ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మెడికల్‌ కాలేజీల (Medical College)  విషయంలో వయోపరిమితిని బిల్లును కూడా గవర్నర్ రిజెక్ట్ చేసింది. దానికి సంబంధించిన సవరణ బిల్లును కూడా ఈ అసెంబ్లీ సమావేశంలో (Assembly Meeting) మళ్లీ తీసుకురానున్నారు. తిరిగి ఈ రెండు బిల్లులను కూడా గవర్నర్ దగ్గరకు పంపించనున్నారు.

కేబినేట్ భేటీలో కీలక విషయాలు

ఈనెల 31న కేబినేట్ భేటీలో కీలక విషయాలు వెలువడనున్నాయి. వ్యవసాయరంగంపైన (Agriculture) కీలక నిర్ణయం తీసుకోనున్నారు. 40-50 దాకా ఎజెండా (Agenda) ప్రకటించే ఛాన్స్ ఉంది. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కురిసిన వర్షాల కారణంగా కేంద్రం సహాయం (Central Govt Help) చేయకపోవడంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాకుండా రానున్న ఎన్నికలను (Upcoming Elections) దృష్టిలో ఉంచుకొని బీఆర్‌ఎస్ పార్టీ (BRS Party) సర్వం సిద్ధం చేసుకుంది.కొన్ని అంశాలపై కేబినేట్‌లో (Cabinet) కీలక నిర్ణయం తీసుకోని అఫ్రూవల్ చేయనుంది. ఎన్నికల ఆధారంగానే ఈ సమావేశం ఉండబోతోంది. ప్రతిపక్షాల ప్రశ్నలను (Opposition Parties) ఎదుర్కొనే విధంగా సీఎం కేసీఆర్ (CM KCR)  ఇప్పటికే అన్నిరకాలుగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలను అన్నిరకాలుగా ఎదుర్కొని వాటికి అన్నివిధాలుగా ధీటుగా ఎదుర్కొనేందుకు సీఎం కేసీఆర్ సన్నద్ధం అవుతున్నారు. దీంతో ప్రధాన వామపక్షాలు మాత్రం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు సన్నద్ధం అవుతున్నారు.

Advertisment
తాజా కథనాలు