Telangana: పంచాయతీరాజ్‌శాఖలో భారీగా బదిలీలు.. ఎందుకంటే

లోక్‌సభ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు.. తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్‌ శాఖలో భారీగా బదిలీలు చేస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది. ఈ శాఖలో పనిచేస్తున్న 105 మంది అధికారుల్ని బదిలీ చేసింది.

New Update
Telangana: పంచాయతీరాజ్‌శాఖలో భారీగా బదిలీలు.. ఎందుకంటే

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో ప్రభుత్వ అధికారుల బదిలీ కొనసాగుతోంది. తాజాగా పంచాయతీరాజ్‌ శాఖలో భారీగా బదిలీలు చేస్తూ.. పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ శాఖలో పనిచేస్తున్న 105 మంది అధికారుల్ని బదిలీ చేశారు. జడ్పీ సీఈవో, అడిషనల్‌ డీఆర్డీవో, డీపీవోలు బదిలీ అయ్యారు. సొంత జిల్లాల్లో పని చేస్తున్న వాళ్లతో పాటు మూడేళ్లకుపైగా ఒకేచోట పని చేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Also read: తెలంగాణ వ్యతిరేకులకే ప్రగతి భవన్ లో రెడ్ కార్పేట్ వేశారు.. పొన్నం ప్రభాకర్

ఇదిలాఉండగా.. రాష్ట్ర ఆబ్కారీశాఖలో కూడా 14 మంది ఎక్సైజ్‌ సూపరింటెండెట్లు, ఇద్దరు ఉప కమిషనర్లు, 9 మంది సహాయ కమిషనర్లను కూడా ట్రాన్స్‌ఫర్ చేసింది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో పెద్ద ఎత్తున తహశీల్దార్లను కూడా ప్రభుత్వ బదిలీ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా.. 132 మంది తహశీల్దార్లు, 32 మంది డిప్యూటీ కలెక్టర్ల(RDO)ను బదిలీ చేస్తూ శనివారం నాడు రెవెన్యూ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఇంత భారీ స్థాయిలో బదిలీలు జరగడం ఇదే తొలిసారి.

Also Read: గ్రూప్‌-1 అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. త్వరలోనే నోటిఫికేషన్..

Advertisment
Advertisment
తాజా కథనాలు