Telangana Elections: తెలంగాణలో ఎన్నికల ఫైట్ పీక్స్‌కు చేరింది. హ్యాట్రిక్ కొడతామని అధికార పార్టీ అంటుంటే.. లేదు లేదు ఈసారి అధికారం మాదే అంటున్నాయి కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP)లు. ఈ క్రమంలోనే ఆయా పార్టీల నేతలు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అటు భౌతిక ప్రచారంతో పాటు.. ఇటు సోషల్ మీడియా, ప్రసార సాధనాలు వేదికగానూ ప్రచారం సాగిస్తున్నారు. ఇక ప్రచార పర్వంలో ఒక్కో పార్టీది ఒక్కో స్టైల్.. అధికార పార్టీది ఒక ఎత్తైతే.. ప్రతిపక్ష పార్టీలది మరో ఎత్తు. ఇక ఒకరిపై మరొకరు వేసుకునే సెటైర్లకు హద్దులు, సరిహద్దులే లేవనుకోవాలి.
తాజాగా కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ టార్గెట్‌గా కాంగ్రెస్ పార్టీ సంచలన పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడిని రాజేశాయి. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్.. ఇప్పుడు ఆ ఆరోపణలకు మరింత మసాలా దట్టించి పోస్ట్ చేసింది. రెండు పార్టీల మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని, త్వరలోనే ఈ రెండు పార్టీలు వివాహం చేసుకోబోతున్నాయంటూ ఓ సెటైరికల్ వెడ్డింగ్ కార్డ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు సోషల్ మీడియాతో వైరల్ అవుతోంది. పూర్తి తెలంగాణ యాసలో ఉన్న ఈ వివాహ ఆహ్వాన పత్రికపై.. 'బీజేపీ, బీఆర్ఎస్ లగ్గం పిలుపు' ఈ ఇన్విటేషన్ ఉంది.
ఇదికూడా చదవండి: మీ శరీరంలో ఈ 4 లక్షణాలు కనిపిస్తే పొరపాటున కూడా విస్మరించకండి.. జీవితాంతం చింతించాల్సి వస్తుంది..!
ఇన్విటేషన్ ఇలా..
'బీజేపీ, బీఆర్ఎస్ లగ్గం పిలుపు (తెలంగాణ అమరవీరుల ఆత్మఘోషతో). ముహూర్తం 2023 ఎన్నికల్లో.. బీజేపీ&బీఆర్ఎస్ ల పెండ్లి పిలుపు. నక్షత్రం: కవితపై కరుణ నక్షత్రంలో. పిలిశెటోళ్లు: మోదీ, కేసీఆర్& తెలంగాణ మంత్రులు. లగ్గం వేడుక: రాజకీయ బాగోతమేసే వారి ఇంట. లగ్గం జరిగేది కేసీఆర్ ఫామ్ హౌస్‌లో. ఇంతకీ ఈ పెండ్లికి బీఆర్ఎస్‌కు బీజేపీ ఇస్తున్న కట్నం ఏంటో తెలుసా? లిక్కర్ స్కామ్‌లో కవితమ్మను అరెస్ట్ కాకుండా అభయం. అర్సుకునేటోళ్లు: కేటీఆర్, హరీశ్ రావు, కవిత, కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ్, ఈటల రాజేందర్, అర్వింద్. నాకు నువ్వు బీఆర్ఎస్, నీకు నేను బీజేపీ.. లోపాయికారి ఒప్పందం మాది. బీఆర్ఎస్, బీజేపీ మిత్రుల అభినందనలతో.. మా పార్టీ లగ్గంను తెలంగాణ ప్రజలందరూ సూడాలే.
బీజేపీ, బీఆర్ఎస్ ఏడడుగుల బంధం..
❁ పెళ్లిలో ఏడు అడుగులకు ఏడు అంశాలతో సెటైర్లు..
❁ మొదటి అడుగు: నోట్ల రద్దులో ఒకరికి ఒకరు మద్దతు
❁ రెండో అడుగు: కాళేశ్వరం కుంభకోణానికి మోడీ అండ
❁ మూడో అడుగు: పెట్రోల్, డీజిల్, గ్యాస్‌పై టాక్స్‌ల కుంభకోణం
❁ నాలుగో అడుగు: ధరణితో తెలంగాణల భుముల కుంభకోణం
❁ ఐదు అడుగు: లక్ష ఉద్యోగాలని కేసీఆర్, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలని మోడీ నయవంచన
❁ ఆరో అడుగు: పేపర్ లీకేజీపై సీబీఐ ఎంక్వైరీ వేయకపోవడం
❁ ఏడో అడుగు: బండి సంజయ్ అధ్యక్ష పదవి పీకేసి కిషన్ రెడ్డి చేతిలో పెట్టడం
అంటూ ఈ సెటైరికల్ వెడ్డింగ్ కార్డును క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు.
ఇదికూడా చదవండి: అత్యధి మైలేజీ కార్ల కోసం చూస్తున్నారా? బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్ల వివరాలు మీకోసం..