Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల ప్రచారానికి ఎంట్రీ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఈరోజు హనుమకొండలో బీజేపీ (BJP) ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. అనంతరం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేశారు. జనసేన (Janasena) పార్టీ పుట్టింది తెలంగాణలోనే అని అన్నారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకొని జనసేన ఎన్నికల పోటీలో దిగుతున్న విషయం తెలిసిందే.
ALSO READ: ‘యూజ్ లెస్ ఫెలో’.. కేటీఆర్ పై ధ్వజమెత్తిన బండి!
ఆర్ట్స్ కళాశాల మైదానంలో బహిరంగ సభకు హాజరైన పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. నా పోరాటానికి తెలంగాణ యువత అండగా ఉంటోందని అన్నారు. ఆంధ్రాలో ఎలా తిరుగుతున్నానో తెలంగాణలో కూడా అలాగే తిరుగుతాను స్పష్టం చేశారు. ఏ మార్పు కోసం తెలంగాణ బిడ్డలు చనిపోయారో అది సాధిస్తా అని అన్నారు.
బలిదానాలపై ఏర్పడిన రాష్ట్రం అవినీతిమయం కావడం బాధ కలిగించిందని బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. తనకు తెలంగాణ ఎంతో బలాన్నిచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలతో పోరాడుతున్నా అని వైసీపీ పార్టీపై పరోక్షంగా విమర్శించారు. నాడు తెలంగాణకు మద్దతు ఇచ్చినవారిలో తాను ఒకడిని అని అన్నారు. తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయాం అని అన్నారు.
ALSO READ: పాల ప్యాకెట్లపై GST… హరీష్ రావు కీలక వ్యాఖ్యలు!