Telangana CM Revanth Reddy :సలార్ సాంగ్ పై సీఎం రేవంత్ రెడ్డి ప్రేమ

డిసెంబర్ 22న విడుదల అయిన సలార్ సినిమా సంచలనాలను సృష్టిస్తోంది. ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఇందులో ఉన్న ఒకే ఒక్క పాట సురీడే గొడుగుపట్టి విపీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ ట్రెండ్‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫాలో అయిపోతున్నారు.

Telangana CM Revanth Reddy :సలార్ సాంగ్ పై సీఎం రేవంత్ రెడ్డి ప్రేమ
New Update

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సలార్ మూవీ చూశారో లేదో తెలియదు కానీ దాని మాత్రం అభిమానాన్ని చూపిస్తున్నారు. తన వీడియోకు సలార్‌లోని పాటను జత చేయడమే కాక లిరిక్స్ రాసి మరీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. సలార్ లోని సూరీడే గొడుగుపట్టి పాట చాలా హిట్ అయింది. దానిలోని ఇంటెన్స్ లిరిక్స్ అందరినీ ఆకర్టుకుంటున్నాయి. అందుకే ఈపాటను సందర్భానికి తగ్గట్టు ఎవరికి వారు వాడేసుకుంటున్నారు. పొలిటికల్ లీడర్స్ అభిమానులు తమ లీడర్‌కు తగ్గట్టుగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

నాగపూర్‌లో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సభ జరిగింది. దానిలో తెలంగాణ నేతలతో పాటూ సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అక్కడ ఆయన సాదర స్వాగతం కూడా లభించింది. ఇందులో రేవంత్, రాహుల్ గాంధీ నడిచి వస్తుంటే వీడియో తీశారు. ఇద్దరూ అందరికీ అభివాదాలు చేసుకుంటూ నడుచుకుంటూ వచ్చారు. దీనికి రేవంత్ సలార్ పాటను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌గా పెట్టి తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. రాహుల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ పాట లిరిక్స్ కూడా జత చేశారు. రేవంత్ రెడ్డి ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది. దీనికి బోలెడు కామెంట్స్ కూడా వస్తున్నాయి.

#salaar #x #telangana #tweet #revanth-reddy #cm #song
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe