Telangana: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు గాలం.. కేబినేట్ విస్తరణ ఎప్పుడంటే ? తెలంగాణలో జులై మొదటివారంలో కేబినేట్ విస్తరణ ఉంటుందని ప్రచారం నడుస్తోంది. మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ గాలం వేస్తున్నట్లు సమాచారం. వాళ్లు వచ్చాకే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. By B Aravind 28 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Cabinet: తెలంగాణ కేబినేట్ విస్తరణ వాయిదా పడినట్లు తెలుస్తోంది. జులై మొదటివారంలో కేబినేట్ విస్తరణ ఉంటుందని ప్రచారం నడుస్తోంది. అయితే మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు (BRS MLA) కాంగ్రెస్ గాలం వేస్తున్నట్లు సమాచారం. వాళ్లు వచ్చాకే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కొంతమంది బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవి ఇస్తేనే కాంగ్రెస్‌లోకి (Congress) వస్తామని కండీషన్ పెడుతున్నారు. అందుకే విస్తరణ వాయిదా పడినట్లు ప్రచారం జరుగుతోంది. Also Read: హోరాహోరీగా ట్రంప్ – బైడెన్ మధ్య డిబేట్ అయితే ఇప్పటికిప్పుడు కేబినెట్ విస్తరణ చేస్తే.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ రాకపోవచ్చనే చర్చ నడుస్తోంది. అందుకే కొందరికి మంత్రి పదవులు ఇచ్చి పార్టీలోకి లాగాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. పార్టీలోకి పూర్తిస్థాయి చేరికలు జరిగిన తర్వాతే కేబినెట్ విస్తరణ చేయాలని సీఎం రేవంత్ (CM Revanth Reddy) భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు దూరంగా ఉంటున్నారు. ఇప్పటివరకు కొందరు సీనియర్ నేతలు కేసీఆర్‌ను కలవలేదు. ఇటీవల పోచారం శ్రీనివాస రెడ్డి, తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇంకా ఎవరెవరు చేరతారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. Also Read: మనకు గిదో లెక్కనా.. దొంగల్లో కలిసెటోళ్ల గురించి బాధలేదు! #brs #telugu-news #telangana-news #congress #cabinet-expansion మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి