Kishan Reddy : బీజేపీ గెలవొద్దని కుట్రలు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలవొద్దని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని అన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్‌కు ఓటేసినా, బీఆర్ఎస్‌కు ఓటేసినా ఒకటే అని అన్నారు. ఎన్నికల్లో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. By V.J Reddy 08 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి BJP Chief Kishan Reddy : తెలంగాణ(Telangana) లో పార్లమెంట్ ఎన్నికల(Lok Sabha Elections) కోసం కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు టీ-బీజేపీ(BJP) చీఫ్ కిషన్ రెడ్డి(Kishan Reddy). రేపు ఎన్నికల కమిటీ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణలో వాతావరణం బీజేపీకి చాలా అనుకూలంగా ఉందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) పార్టీలకు ఓటేసిన వారు సైతం ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై బీజేపీ గెలవకూడదు అన్నట్టుగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ కు ఓటేసినా, బీఆర్ఎస్ కు ఓటేసినా ఒకటే అని అన్నారు. ఈ రెండు పార్టీలు డూప్ ఫైట్ చేస్తున్నాయని ఆరోపించారు. దేశంలో చాలా కొద్ది రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పోటీలో ఉంది, అందులో తెలంగాణ ఒకటి అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అరకొర ఒక సీటు గెలిచినా ఉపయోగం లేదని... గెలవకపోయినా తెలంగాణకు వచ్చిన నష్టం లేదని అన్నారు. ALSO READ: తెలంగాణలో కొత్త ఇసుక పాలసీ… సీఎం రేవంత్ కీలక నిర్ణయం! టార్గెట్ అసదుద్దీన్... తెలంగాణలో మొత్తం 17 సీట్లకు బీజేపీ సొంతంగా పోటీ చేస్తుందని అన్నారు. అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేసే హైదరాబాద్(Hyderabad) సీటు కూడా గెలవడం కోసం పనిచేస్తాం అని పేర్కొన్నారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ బలమైన అభ్యర్థులతో వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. రెండు మూడు రోజుల్లో సమగ్ర కార్యాచరణతో ముందుకెళ్తాం అని స్పష్టం చేశారు. అన్ని వర్గాల నుంచి బీజేపీలో చేరేందుకు ఉత్సాహంగా వస్తున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే సీబీఐ దర్యాప్తు... అధికారంలోకి వస్తే సీబీఐ దర్యాప్తు జరిపిస్తామని చెప్పినవారు ఇప్పుడెందుకు మిన్నకుండి పోయారు అని కాంగ్రెస్ పార్టీ ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ తో ఆడుకోవద్దని.. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాలు కూర్చుని సమస్యలు పరిష్కారం చేసుకోవాలని సూచించారు. ఎన్ని కుట్రలు చేసినా... కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఎన్ని కుట్రలు చేసినా మెజారిటీ స్థానాలు గెలిచేది బీజేపీ యే అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే వసూళ్ల పర్వం మొదలైందని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను పిలిపించి బెదిరిస్తున్నారని ఆరోపించారు. అనేకమంది కాంగ్రెస్ పార్టీకి సూట్ కేసులు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ఉనికి లేదని అన్నారు. తెలంగాణలో ఎవరితో పొత్తులు లేవని.. 17 సీట్లలో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. Also Read: బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి కీలక నేత జంప్ DO WATCH: #brs #congress #cm-revanth-reddy #bjp #kishan-reddy #mp-elections-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి