/rtv/media/media_files/2025/04/18/jwythS0nOwHGBiKPPnkD.jpg)
Xiaomi launches new smart home projector
చాలా మంది థియేటర్లకు వెళ్లే తీరిక లేక సినిమాలను మిస్ అవుతుంటారు. అలాంటి వారికోసం ఇప్పుడు థియేటర్ అనుభవాన్ని అందించే కొత్త ప్రొజెక్టర్ అందుబాటులోకి వచ్చింది. షియోమి సబ్ బ్రాండ్ రెడ్‌మి కొత్త కాంపాక్ట్ ప్రొజెక్టర్ రెడ్‌మి ప్రొజెక్టర్ 3 లైట్‌ను చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ప్రొజెక్టర్ 1st జెన్ స్ట్రీమింగ్ కోసం తయారుచేయబడింది. ఇది పోర్టబుల్, స్మార్ట్, ఇంట్లో సౌకర్యాన్ని అందిస్తుంది. ఇప్పుడు రెడ్‌మి ప్రొజెక్టర్ 3 లైట్ ధర, స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం.
Also Read : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ వాసుల దుర్మరణం!
Redmi Projector 3 Lite Price
Redmi Projector 3 Lite ధర 699 యువాన్లు (సుమారు రూ. 8,197)గా కంపెనీ నిర్ణయించింది. ఈ ప్రొజెక్టర్ JD.com లో అందుబాటులో ఉంది. దీని సేల్ ఏప్రిల్ 22 నుండి చైనా మార్కెట్లో ప్రారంభమవుతుంది. త్వరలో ఇది భారత్ మార్కెట్‌లోకి రానుంది.
Also read: Lady Don: హాట్ టాపిక్‌గా లేడీ డాన్ జిక్రా.. ఏకంగా ఢిల్లీ సీఎం వార్నింగ్
Redmi Projector 3 Lite Specifications
రెడ్‌మి ప్రొజెక్టర్ 3 లైట్ పూర్తి గ్లాస్ లెన్స్‌లో పూర్తిగా సీలు చేయబడిన ఆప్టికల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది ఇమేజ్ స్టెబిలిటీనితో 20 డిగ్రీల వరకు సైడ్ ప్రొజెక్షన్‌ను అందిస్తుంది. అప్‌గ్రేడ్ చేసిన కూలింగ్ సిస్టమ్‌తో వస్తుంది. రాత్రంతా సినిమాలు చూసుకోవచ్చు. ఈ ప్రొజెక్టర్ 180 CVIA ల్యూమెన్‌ల బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. చీకటిలో 1080p ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. తక్కువ దూరం నుండి 100 అంగుళాల వరకు స్క్రీన్ పరిమాణాన్ని ప్రొజెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ఇది SGS ద్వారా తక్కువ బ్లూ రేస్‌తో వెరిఫై చేయబడింది. దీని కారణంగా ఎక్కువసేపు చూసిన కళ్లకు ఏం కాకుండా ఉంటుంది.
ఈ ప్రొజెక్టర్ 1.5GHz వద్ద క్లాక్‌తో క్వాడ్-కోర్ అమ్లాజిక్ T950S ప్రాసెసర్‌ను కలిగి ఉంది. దీనిలో 1GB RAM, 32GB స్టోరేజ్ ఉన్నాయి. ఈ ప్రొజెక్టర్ లైట్ స్ట్రీమింగ్ యాప్, షియోమి హైపర్‌ఓఎస్ కనెక్ట్‌తో వస్తుంది. ఇది 146 మిమీ పొడవు, 113 మిమీ వెడల్పు, 172.5 మిమీ మందం, 1.2 కిలోల బరువును కలిగి ఉంటుంది. ఇది పోర్టబుల్ రూపంలో వస్తుంది. అందువల్ల ఎక్కడైనా తీసుకెళ్లి వీక్షించొచ్చు.
ప్రొజెక్టర్ ఆటోమేటిక్ ఫోకస్, కీస్టోన్ కరెక్షన్ కోసం ToF లేజర్ సెన్సార్‌ను కలిగి ఉంది. 3 లైట్‌లోని కనెక్టివిటీ ఆప్షన్లలో ARCతో HDMI, USB 2.0, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi వంటివి ఉన్నాయి. ఇది నావిగేషన్‌ను సులభతరం చేస్తూ వాయిస్ కమాండ్‌లకు మద్దతు ఇచ్చే బ్లూటూత్ రిమోట్‌తో వస్తుంది.
mini-projector | mini-projector-under-budget | latest-telugu-news | telugu-news