/rtv/media/media_files/2025/10/29/ampere-magnus-ev-2025-10-29-09-52-58.jpg)
Ampere Magnus EV
ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లను అందిస్తోంది. భారీ ధర ఉండే ఆంపియర్ మాగ్నస్ EV స్కూటర్‌పై తగ్గింపును పొందవచ్చు. రూ.89,999 ధర ఉండే ఆంపియర్ మాగ్నస్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ ధరకే లభిస్తుంది. అయితే అదెలాగో మరి ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: New Smartphone: గేమింగ్ ఫీచర్లు, 7300mAh బ్యాటరీతో కొత్త ఫోన్ పిచ్చెక్కించింది భయ్యా..
భారీ తగ్గింపుతో ఆఫర్..
ఆంపియర్ మాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 89,999గా ఉంది. అయితే దీన్ని మీరు కానీ మీరు ఇప్పుడు దానిని రూ.70 వేలకు కొనుగోలు చేయవచ్చు. సాధారణంగా మీకు 9 శాతం డిస్కౌంట్ లభించగా అదనంగా ఇంకా తగ్గింపు లభిస్తుంది. క్రెడిట్ కార్డ్ ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే మీకు అదనంగా రూ.11,250 తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై అందుబాటులో ఉంది. మొత్తం మీద చూసుకుంటే మీకు రూ.20 వేల తగ్గింపుతో ఎలక్ట్రిక్ స్కూటర్ పొందవచ్చు.
మీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేకపోతే రూ.7 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. Paytm, BHIM యాప్, Google Pay, Phone Pay ద్వారా చెల్లిస్తే ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు కూడా అద్భుతంగా ఉన్నాయని పలువురు చెబుతున్నారు. ఇప్పటికే వీటికి డిమాండ్ బాగా పెరిగింది. దీనికి రేటింగ్ కూడా 4 కంటే ఎక్కువ ఉంది. ఈ స్కూటర్‌కు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 90 కిలోమీటర్లు ప్రయాణించగలదు. దీని గరిష్ట వేగం గంటకు 65 కిలోమీటర్లు. ఛార్జింగ్ పెట్టడానికి 4.5 గంటలు పడుతుంది. దీనికి ట్యూబ్‌లెస్ టైర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ వాహనం 5 సంవత్సరాలు లేదా 75 వేల కిలోమీటర్ల గ్యారెంటీతో వస్తుంది.
బ్యాటరీ 3 సంవత్సరాలు లేదా 30 వేల కిలోమీటర్ల గ్యారెంటీతో వస్తుంది. ఈ స్కూటర్ ని మీరు EMI ద్వారా ఇంటికి తీసుకురావచ్చు. నో-కాస్ట్ EMI వల్ల మీకు కాస్త ప్రయోజనం ఉంటుంది. ఏడాదికి పెట్టుకుంటే.. ప్రతీ నెల రూ.6900 కట్టుకోవచ్చు. అదే 9 నెలలకు అయితే మీరు నెలకు రూ.9200 చెల్లించాలి. మీరు పెట్టుకునే సమయం బట్టి ఉంటుంది. అయితే రెండేళ్ల వరకు EMI పెట్టుకుంటే కొంతవరకు ఆర్థికంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: New Smartphone: మోటో నుంచి బెస్ట్ వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు యమ అదుర్స్..!
Follow Us