/rtv/media/media_files/2025/06/25/shubhanshu-shukla-2025-06-25-08-03-59.jpg)
భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా పేరు బాగా వినిపిస్తోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన రెండో భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ఆయనకు, ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌లో అశోక చక్ర పురస్కారం లభించే అవకాశం ఉందని రక్షణ శాఖ వర్గాల సమాచారం. 2025 జూన్‌లో యాక్సియమ్-4 మిషన్‌లో భాగంగా శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. సుమారు 18 రోజుల పాటు అక్కడ ఉండి, మైక్రోగ్రావిటీపై కీలక శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే 'గగన్‌యాన్' మిషన్‌కు ఆయన సాధించిన అనుభవం వెలకట్టలేనిది. ఈ క్రమంలో వైమానిక దళంలో ఆయన ప్రదర్శించిన ధైర్యసాహసాలు, అంతరిక్ష యానంలో భారత్ కీర్తిని ప్రపంచానికి చాటినందుకు ఈ గౌరవం దక్కనుంది.
Astronaut Shubhanshu Shukla likely to be awarded Ashok Chakra on Republic Day#astronaut#shubhanshushukla#ashokchakra#republicdaypic.twitter.com/WsM2C1FwNy
— Savera Times Haryana (@Savera_Haryana) January 25, 2026
యూపీ గౌరవ సమ్మాన్ పురస్కారం
రిపబ్లిక్ డే వేడుకలకు ముందే, జనవరి 24న జరిగిన 'ఉత్తరప్రదేశ్ దివస్' వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా శుభాన్షు శుక్లా 'ఉత్తరప్రదేశ్ గౌరవ సమ్మాన్' అందుకున్నారు. తన స్వస్థలమైన లక్నోలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తన ప్రయాణం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ 2026 రిపబ్లిక్ డే సెలబ్రేషన్లకు చాలా స్పెషాలిటీ ఉంది. యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ హాజరవుతున్నారు. అలాగే వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక ప్రదర్శనలు ఉన్నాయి. భారత వైమానిక దళం నిర్వహించే విన్యాసాల్లో కూడా శుక్లా సాధించిన విజయాల ప్రస్తావన ఉండే అవకాశం ఉంది.
గాలిలో ఫైటర్ పైలట్‌గా, నింగిలో వ్యోమగామిగా దేశానికి సేవ చేస్తున్న శుభాన్షు శుక్లాకు అశోక చక్ర లభించడం ప్రతి భారతీయుడికి గర్వకారణం. ఇది కేవలం ఒక వ్యక్తికి దక్కే గౌరవం మాత్రమే కాదు, భారత అంతరిక్ష పరిశోధన రంగం సాధించిన విజయానికి నిదర్శనం.
Follow Us