Vivo Y400 5G: వివో నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్.. చూస్తే పిచ్చెక్కిపోతారు..!

Vivo Y400 5G భారతదేశంలో లాంచ్ అయింది. దీని 8GB+128GB ధర రూ.21,999గా కంపెనీ నిర్ణయించింది. అలాగే 8GB+256GB ధర రూ.23,999గా ఉంది. ఆగస్టు 7 నుంచి దీని సేల్స్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, వివో ఈ స్టోర్‌, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. 

New Update
_Vivo Y400 5G

Vivo Y400 5G

Vivo Y400 5G భారతదేశంలో లాంచ్ అయింది. గత నెలలో Vivo దేశంలో Y400 Pro 5Gని పరిచయం చేసింది. రాబోయే స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంటుంది. దీనితో పాటు, కంపెనీ తన 4G వేరియంట్‌ను ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్లలో కూడా పరిచయం చేస్తుంది.

Vivo Y400 5G Launched

భారతదేశంలో Vivo Y400 5G లాంచ్ అవుతుందని వివో గతంలో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రమోషనల్ బ్యానర్‌లో ఇది గ్లామ్ వైట్, ఆలివ్ గ్రీన్ కలర్‌లలో అందుబాటులో ఉంటుంది. Vivo Y400 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో 120 Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది Snapdragon 4 Gen 2 ప్రాసెసర్‌తో వచ్చింది. 

ఇది రెండు వేరియంట్లలో వస్తుంది. అందులో 8GB+128GB ధర రూ.21,999గా కంపెనీ నిర్ణయించింది. అలాగే 8GB+256GB ధర రూ.23,999గా ఉంది. ఆగస్టు 7 నుంచి దీని సేల్స్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, వివో ఈ స్టోర్‌, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. 

Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో బ్లాక్ బస్టర్ సేల్.. Google Pixel 9 ఫోన్‌పై రూ.22 వేల భారీ డిస్కౌంట్!

Vivo Y400 5Gలో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంటుంది. వెనుక వైపు 50ఎంపీ + 2ఎంపీ రియర్ కెమెరా, ముందువైపు 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. దీనిలో పిల్-ఆకారపు రియర్ కెమెరా మాడ్యూల్ పొడువుగా అందించారు. సెకండరీ కెమెరా చిన్న స్క్విర్కిల్ స్లాట్‌లో ఇచ్చారు. దీనికి కెమెరా ఐలాండ్ కింద ఆరా లైట్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వెనుక కెమెరా ఐలాండ్‌తో పాటు LED ఫ్లాష్ యూనిట్ అందించారు. 

Vivo Y400 5G ఫోన్ 90 W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6,000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. Vivo Y400 5G స్మార్ట్‌ఫోన్‌లో Android 15 ఆధారంగా FuntouchOS 15 అందించారు. ముందు భాగంలో కెమెరా కోసం హోల్-పంచ్ కటౌట్ అందించారు. ఈ సిరీస్ ప్రో వెర్షన్‌తో పోలిస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, పనితీరులో కొంత తగ్గింపు ఉంది. 

Also Read: దుమ్ముదులిపేసిన రెడ్‌మీ.. కొత్త ఫోన్ ఏముందిరా బాబు - అదిరిపోయింది!

Vivo Y400 5G లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)కి సంబంధించిన కొన్ని ఫీచర్లు కూడా అందించారు. వీటిలో AI ఫోటో ఎన్‌హాన్స్, AI ఎరేస్, AI నోట్ అసిస్ట్ ఉన్నాయి. Vivo V60 కూడా త్వరలో దేశంలో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 1.5K రిజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 

Advertisment
తాజా కథనాలు