/rtv/media/media_files/2025/08/03/flipkart-freedom-sale-2025-discount-2025-08-03-15-55-48.jpg)
Flipkart Freedom Sale 2025 discount
ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే కొత్త సేల్ తీసుకొచ్చింది. తాజాగా Flipkart Freedom Sale 2025 ప్రకటించింది. ఈ సేల్‌లో కస్టమర్లు స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు పొందవచ్చు. ఆగస్టు 1న మొదలైన ఈ సేల్ ఆగస్టు 8 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో ఒక స్మార్ట్‌ఫోన్‌పై రూ.22,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సేల్‌లో తక్కువ ధరకు అందుబాటులో ఉన్న ఫోన్ ఏదో తెలుసుకుందాం.
Flipkart Freedom Sale 2025 discount
ఫ్లిప్‌కార్ట్‌లో Google Pixel 9 ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ భారతదేశంలో రూ.79,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఈ ఫోన్‌లో Google కొత్త Tensor G4 చిప్‌సెట్, శక్తివంతమైన కెమెరా సెటప్, Pixel సిరీస్ AI ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు Google Pixel 9 ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.64,999కి లిస్ట్ అయింది. అంటే అసలు ధర కంటే రూ.15,000 డైరెక్ట్ డిస్కౌంట్ లభిస్తుందన్నమాట.
దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా నో-కాస్ట్ EMIలో కొనుగోలు చేస్తే.. అదనంగా రూ.7,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ విధంగా మొత్తం డిస్కౌంట్ రూ.22,000 అందుతుంది. ఈ డిస్కౌంట్‌తో ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇప్పుడు దాదాపు రూ.58,000 ధరకు కొనుక్కోవచ్చు.
Google Pixel 9 మొబైల్ 9 6.3 -అంగుళాల యాక్టువా OLED డిస్‌ప్లేను పొందుతుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ 1080×2424 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. డిజైన్ చాలా ప్రీమియంగా ఉంది. ఫ్లాట్ ఫ్రేమ్, క్లాసిక్ కెమెరా బార్‌ను కలిగి ఉంటుంది. దీని లోపల గూగుల్ తాజా టెన్సర్ G4 ప్రాసెసర్ ఉంది. ఇది శక్తివంతమైన పనితీరును అందిస్తుంది. అలాగే సర్కిల్ టు సెర్చ్, మ్యాజిక్ ఎడిటర్, లైవ్ ట్రాన్స్‌లేషన్ వంటి AI- ఆధారిత ఫీచర్లతో వస్తుంది.
Google Pixel 9 మొబైల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 48MP అల్ట్రా-వైడ్ కెమెరా, 8x సూపర్ రిజల్యూషన్ జూమ్‌కు మద్దతు ఇస్తుంది. ముందు భాగంలో 10.5MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 4K రికార్డింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. దీని 4700mAh బ్యాటరీ 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, Qi వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్, ఆండ్రాయిడ్ 15 పై నడుస్తుంది.