Redmi Note 14 SE 5G: దుమ్ముదులిపేసిన రెడ్‌మీ.. కొత్త ఫోన్ ఏముందిరా బాబు - అదిరిపోయింది!

Redmi Note 14 SE 5G భారత మార్కెట్‌లో లాంచ్ అయింది. కంపెనీ 6GB/128GB వేరియంట్‌ను రూ.14,999 ధరకు తీసుకొచ్చింది. ఆగస్టు 7 నుండి సేల్‌ ప్రారంభం కానుంది. మొదటి సేల్‌లో రూ.1000 తగ్గింపు పొందొచ్చు. దీనిని Flipkart, Mi.com, రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుక్కోవచ్చు.

New Update
Redmi Note 14 SE 5G launched

Redmi Note 14 SE 5G launched

ప్రముఖ టెక్ బ్రాండ్ షియోమి తన లైనప్‌లో ఉన్న మరో మోడల్‌ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. Redmi Note 14 SE 5G పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. Redmi Note 14 SE 5G మొబైల్ Mediatek Dimensity 7025 Ultra ప్రాసెసర్ పై పనిచేస్తుంది. 6GB RAM, 128GB స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ 6.67-అంగుళాల FHD + 120Hz AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. 5110mAh బ్యాటరీతో వస్తుంది. ఇప్పుడు ఈ ఫోన్‌ ధర, స్పెసిఫికేషన్లు, ఆఫర్‌ల గురించి తెలుసుకుందాం. 

Also Read: సూపరెహే.. వివో నుంచి మరో బ్లాక్ బస్టర్ మొబైల్.. మరింత గ్రాండ్‌ డిజైన్

Redmi Note 14 SE 5G Price

భారతదేశంలో Redmi Note 14 SE 5G ఫోన్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 14,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ క్రిమ్సన్ ఆర్ట్, మిస్టిక్ వైట్, టైటాన్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ ఆగస్టు 7 నుండి Flipkart, Mi.com, రిటైల్ స్టోర్‌లలో ప్రారంభమవుతుంది. కస్టమర్‌లు మొదటి సేల్‌లో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.1,000 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. 

Redmi Note 14 SE 5G Specs

Redmi Note 14 SE 5G మొబైల్ 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. HDR10+, డాల్బీ విజన్, 2160Hz ఇన్స్టంట్ టచ్ శాంపిల్ రేట్‌తో 2,100 nits పీక్ బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ MediaTek Dimensity 7025 Ultra Soc పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS పై నడుస్తుంది. 

Also Read: స్మార్ట్‌ఫోన్ల జాతరే జాతర.. మోటో, వివో, రెడ్‌మీ నుంచి హైక్లాస్ మోడల్స్!

Redmi Note 14 SE 5G మొబైల్ 50MP సోనీ LYT-600 ప్రైమరీ సెన్సార్, 8MP వైడ్ యాంగిల్, 2MP లెన్స్‌తో వస్తుంది. అదే సమయంలో ముందు భాగంలో 20MP ఫ్రంట్ షూటర్ ఉంటుంది. ఈ ఫోన్ 5,110mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది Mi టర్బోచార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. భద్రత కోసం డిస్‌ప్లే కింద ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్‌లో డాల్బీ అట్మాస్‌కు మద్దతు ఇచ్చే డ్యూయల్-స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.

tech-news-telugu | telugu tech news | telugu-news

Advertisment
తాజా కథనాలు