Vivo Y-Series: వివో మావ దించేస్తున్నాడు.. Y-సిరీస్ నుంచి కిర్రాక్ ఫోన్ రెడీ!

వివో త్వరలో కొత్త Yసిరీస్ ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇది కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుందని సమాచారం. రాబోయే Vivo Y-సిరీస్ హ్యాండ్‌సెట్ మూడు కలర్‌ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇది రూ. 15,000 కంటే తక్కువ ధరతో రావచ్చు.

New Update
Vivo Y19 5G..

Vivo Y19 5G..

చైనీస్ టెక్ బ్రాండ్ వివో గత నెలలో Vivo Y19 5G స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. దీనిని MediaTek Dimensity 6300 చిప్‌సెట్, 5,500mAh బ్యాటరీతో రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ బ్రాండ్ త్వరలో దేశంలో మరొక కొత్త Y సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుందని సమాచారం. రాబోయే Vivo Y-సిరీస్ హ్యాండ్‌సెట్ మూడు కలర్‌ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. 

Vivo భారతదేశంలో దాని Y-సిరీస్ కింద కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోందని సమాచారం అందింది. ఇది రూ. 15,000 కంటే తక్కువ ధర కలిగిన విభాగంలో 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌గా వచ్చే అవకాశం ఉందని సమాచారం. రాబోయే వివో వై సిరీస్ ఫోన్.. ఫెస్టివల్ గోల్డ్, ఫ్రీస్టైల్ వైట్, నెబ్యులా పర్పుల్ కలర్‌లలో అందుబాటులో ఉంటుందని అంచనా. Vivo ప్రస్తుతం దాని పోర్ట్‌ఫోలియోలో Vivo Y78 5G, Vivo Y200 Pro, Vivo Y300 Plus వంటి కర్వ్డ్ స్క్రీన్‌లతో కూడిన అనేక స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌లో ఉంచింది. 

RTV News App: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

Vivo Y19 5G Price

Vivo Y19 5G మే నెలలో లాంచ్ అయింది. ఇది MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌పై నడుస్తుంది. 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,499గా కంపెనీ నిర్ణయించింది. Vivo Y19 5G 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల HD+ (720 x 1,600 పిక్సెల్స్) డిస్‌ప్లేను కలిగి ఉంది.

Also Read :  వాయు కాలుష్యంతో అనేక ప్రమాదాలు.. తెలుసుకుంటే షాక్ అవుతారు

వెనుక భాగంలో ఇది 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 0.08-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌తో సహా డ్యూయల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో ఫోన్ 5-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంది. ఇది IP54-రేటెడ్ బిల్డ్‌తో వస్తుంది. 15W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు