/rtv/media/media_files/2025/07/06/vivo-x-fold-5-and-vivo-x200-fe-smartphones-launching-soon-2025-07-06-20-49-50.jpg)
Vivo X Fold 5 and Vivo X200 FE smartphones launching soon
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వివో.. త్వరలో Vivo X Fold 5, Vivo X200 FE భారత మార్కెట్‌లో లాంచ్ చేయనుంది. దీనిని జూలై 14న రిలీజ్ చేయనున్నట్లు వివో కంపెనీ తెలిపింది. X ఫోల్డ్ 5, X200 FE ఫోన్లు ఇప్పటికే చైనా, జపాన్‌లో లాంచ్ అయ్యాయి. ఇవి ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, కంపెనీ వెబ్‌సైట్ ద్వారా సేల్‌కు అందుబాటులో ఉన్నాయి.
Also Read: రోజూ ఆయన కొట్టేవాడు..ఈరోజు నేను కొట్టా..ఒక దెబ్బకే పోయాడు...భార్య సంచలనం
Vivo X Fold 5 and Vivo X200 FE
తాజాగా Vivo X ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫోన్ ధరను ఓ టిప్‌స్టర్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. భారతదేశంలో Vivo X Fold 5 మొబైల్ 16 GB RAM + 512 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,49,999 ఉండే అవకాశం ఉందని తెలిపారు. అదే సమయంలో Vivo X200 FE మొబైల్ 16 GB + 512 GB వేరియంట్ ధర రూ. 59,999 ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు.
Also Read: పోలీసులనే మోసం చేసిన యువతి.. యూనిఫాంలో ట్రైనింగ్ చేస్తూ
చైనాలో లాంచ్ అయిన Vivo X Fold 5 మొబైల్ 6.53-అంగుళాల కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో 8.03-అంగుళాల ఇన్నర్ ఫ్లెక్సిబుల్ ప్యానెల్ ఉన్నాయి. దీని రెండు డిస్ప్లేల బ్రైట్‌నెస్ స్థాయి 4,500 నిట్‌లుగా ఉంటుంది. ఇది Zeiss బ్రాండ్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. 12 GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 84,000, 12 GB + 512 GB ధర సుమారు రూ. 95,900, 16 GB + 512 GB ధర సుమారు రూ. 1,01,900, 16 GB + 1 TB వేరియంట్ ధర సుమారు రూ. 1,14,000 గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి.
అలాగే Vivo X200 FE ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఇది అంబర్ ఎల్లో, ఫ్రాస్ట్ బ్లూ, లక్స్ గ్రే కలర్‌లలో లభిస్తుంది. భారతదేశంలో vivo X200 FE స్మార్ట్‌ఫోన్ 6.31 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది MediaTek Dimensity 9300+ చిప్‌సెట్‌తో వస్తుంది.