/rtv/media/media_files/2025/09/30/vivo-v60e-5g-2025-09-30-18-54-00.jpg)
Vivo V60e 5G
భారతీయ స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Vivo V60e 5G త్వరలో మార్కెట్లో విడుదల కానుంది. Vivo V-సిరీస్‌లో మిడ్-రేంజ్ విభాగంలో ఇది వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంటుందని అంచనా. ఇప్పటికే ఆన్‌లైన్‌లో దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు, ధర వివరాలు వెల్లడయ్యాయి.
Vivo V60e 5G Specifications
Vivo V60e 5G స్మార్ట్‌ఫోన్‌లో 6.77 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. స్పీడ్, పనితీరు కోసం MediaTek Dimensity 7300 టర్బో చిప్‌సెట్ ను ఇందులో అందించారు.
కెమెరా విషయానికి వస్తే.. Vivo V60e 5G ఫోన్‌లో ప్రధాన ఆకర్షణగా 200MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ సెగ్మెంట్‌లో 200MP కెమెరాను అందించడం ఇదే మొదటిసారి. దీనికి 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ తోడవుతుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 50MP కెమెరా అందించారు.
Vivo V60e key specifications officially confirmed
— Harshit Gangyan (@yantra_verse) September 30, 2025
- Front: 50MP with autofocus
- Rear: 200MP main + 8MP ultra-wide + Aura Light LED
- 6,500mAh battery
- 90W charging
- Quad-curved display
- IP68/69 rating
- Funtouch OS 15 | Android 15
- 3 years of OS upgrades
- 5 years of… pic.twitter.com/STHMyMJoM2
బ్యాటరీ సామర్థ్యం విషయానికొస్తే.. ఇందులో 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 6500mAh బ్యాటరీని అమర్చారు. అదనంగా Vivo V60e 5G ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో IP68/IP69ను కలిగి ఉంది. ఇది Android 15 ఆధారంగా FuntouchOS 15పై నడుస్తుంది. ఈ పరికరం మూడు సంవత్సరాల పాటు OS అప్‌గ్రేడ్‌లను, ఐదు సంవత్సరాల పాటు సేఫ్టీ అప్‌గ్రేడ్‌లను అందుకుంటుంది. ఈ వివరాలన్నీ ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అయ్యాయి.
Vivo V60e Price
Vivo V60e భారతదేశంలో మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని వెల్లడైంది. Vivo V60e 5G బేస్ వేరియంట్ (8GB RAM + 128GB స్టోరేజ్) ధర సుమారు రూ. 28,749 నుండి ప్రారంభం అవుతుంది. అలాగే 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.30,749గా ఉంటుంది. అంతేకాకుండా 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 32,749గా నిర్ణయించారు. Vivo V60e ఫోన్ ఎలైట్ పర్పుల్, నోబుల్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో అందించబడుతుందని కంపెనీ తెలిపింది. అందిన సమాచారం ప్రకారం.. అక్టోబర్ 7, 2025న Vivo V60e ఫోన్ భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Vivo V50 5G Specifications
ఇక దీనికంటే ముందు Vivo V50 5G మెరుగైన ఫీచర్లు, అద్భుతమైన డిజైన్‌తో మార్కెట్‌లో సందడి చేస్తోంది. ఈ ఫోన్ శక్తివంతమైన Qualcomm Snapdragon 7 Gen 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. 6.77 అంగుళాల క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. HDR10+ సపోర్ట్ మరియు 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కారణంగా విజువల్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ ఫోన్‌లో Zeiss-బ్రాండెడ్ కెమెరా సెటప్‌ను అందించింది. వెనుక వైపు 50MP మెయిన్ కెమెరా (OIS తో), 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో కూడా 50MP ఆటోఫోకస్ కెమెరా ఉంది. ఇది 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 6000mAh పెద్ద బ్యాటరీని చేర్చారు. దీనికి 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇది 8GB/12GB RAM, 128GB/256GB/512GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68/IP69 రేటింగ్‌ను కలిగి ఉంది.