/rtv/media/media_files/2025/10/18/ulefone-rugking-2025-10-18-13-10-41.jpg)
Ulefone RugKing
Ulefone RugKing సిరీస్‌లోని మొదటి మోడల్ విడుదల అయింది. ఈ ఫోన్ 126 dB సూపర్-లౌడ్ స్పీకర్ తో వస్తుంది. Ulefone RugKing బలమైన బిల్డ్, ప్రకాశవంతమైన డిస్ప్లే, శక్తివంతమైన టార్చ్ వంటి లక్షణాలను కలిగి ఉందని కంపెనీ చెప్పింది. ఈ ఫోన్ Unisoc T7255 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఇది 8GB RAM + 256GB స్టోరేజ్ వస్తుంది. 50MP ప్రధాన వెనుక కెమెరా కూడా ఉంది.
Ulefone RugKing
Ulefone RugKing కంపెనీ అధికారిక వెబ్‌సైట్, స్టోర్‌లలో అందుబాటులో ఉంది. దీని ధర రూ.19,300గా కంపెనీ నిర్ణయించింది. అయితే భారతదేశంలో ఈ ఫోన్ లాంచ్ పై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. Ulefone RugKing ఫోన్ ను కంపెనీ "నిజమైన సర్వైవర్" ఫోన్ అని పిలుస్తుంది. ఈ ఫోన్ అత్యంత స్ట్రాంగెస్ట్ మొబైల్ అని కంపెనీ తెలిపింది. ఫోన్ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 సేఫ్టీతో ​​వస్తుంది. ఇది సాధారణ గాజు కంటే నాలుగు రెట్లు బలంగా ఉంటుందని కంపెనీ చెప్పింది.
కంపెనీ ప్రకారం.. Ulefone RugKing ఫోన్ 2 మీటర్ల ఎత్తు నుండి పడిపోయినా విరిగిపోదు. వాటర్ సమయంలో నష్టాన్ని తగ్గించడానికి నాలుగు మూలల్లో రీన్ఫోర్స్డ్ రక్షణ అందించారు. ఫోన్ పూర్తిగా మూసివున్న డిజైన్‌తో వస్తుంది. ఇది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీతో వస్తుంది. Ulefone RugKing 30 నిమిషాల పాటు నీటిలో లేదా ఇసుకలో మునిగిపోయిన తర్వాత కూడా పనిచేస్తుంది.
Ulefone RugKing అత్యంత ముఖ్యమైన ఫీచర్.. దాని 126 dB సూపర్ స్పీకర్. ఇది 3.5W అవుట్‌పుట్‌ను అందిస్తుంది. కంపెనీ తన విభాగంలో అత్యంత భారీగా ఉండే స్మార్ట్‌ఫోన్ స్పీకర్ అని పేర్కొంది. మీరు పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చే స్థలంలో ఉన్నా, అధిక జనాభా ఉన్న ప్రదేశంలోనైనా లేదా అడవుల మధ్యలో ఉన్నా దాని సౌండ్ ప్రతిచోటా వినిపిస్తుంది.
అదనంగా ఫోన్ పైభాగంలో 126-ల్యూమన్ "సూపర్ టార్చ్" ఫ్లాష్‌లైట్ ఉంది. ఇది చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. క్యాంపింగ్ చేసేటప్పుడు, నైట్ షిఫ్ట్‌లలో లేదా అత్యవసర పరిస్థితుల్లో ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Ulefone RugKingలో Unisoc T7255 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఇది 910 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 5.99-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోటోగ్రఫీ కోసం Ulefone RugKing ఫోన్‌లో 50MP ప్రధాన కెమెరా, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. 8MP ఫ్రంట్ షూటర్ ఉంది. Ulefone RugKing 9600mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది రోజంతా బ్యాకప్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
ఈ ఫోన్ GPay NFCకి మద్దతు ఇస్తుంది. Ulefone RugKing డాక్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ Android 15-ఆధారిత UIతో వస్తుంది. భవిష్యత్తులో Android 16 ని అందుకుంటుందని భావిస్తున్నారు.