New Smartphone: శాంసంగ్ నుంచి మూడు కొత్త ఫోన్లు.. ఫీచర్లు చంపేశాయ్ మచ్చా..!

శాంసంగ్ గెలాక్సీ A07, గెలాక్సీ F07, గెలాక్సీ M07 4G మోడళ్లను భారతదేశంలో విడుదల చేసింది. ఈ ఫోన్లలో MediaTek Helio G99 ప్రాసెసర్, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ ఉన్నాయి. Galaxy A07 ధర రూ.8,999, F07 రూ.7,699, Galaxy M07 రూ. 6,999 నుంచి ప్రారంభమవుతాయి.

New Update
Samsung Galaxy A07, Galaxy F07, Galaxy M07 Launched in india

Samsung Galaxy A07, Galaxy F07, Galaxy M07 Launched in india

Samsung తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ Samsung Galaxy A07, Galaxy M07, Galaxy F07లను భారతదేశంలో విడుదల చేసింది. ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌ల డిజైన్, హార్డ్‌వేర్‌లో పెద్దగా తేడా లేదు. ఈ మూడు ఫోన్లు 6.7-అంగుళాల PLS LCD HD+ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఫోన్ IP54 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉంది. వెనుక ప్యానెల్ గ్లాస్ ఫైబర్ రీన్‌ఫోర్స్డ్ పాలిమర్‌తో రూపొందించారు. ఇది పరికరాన్ని మరింత దృఢంగా చేస్తుంది. దీనికి మీడియాటెక్ హీలియో G99 ప్రాసెసర్ అందించారు. ఇది ARM మాలి-G57 GPU మరియు హైపర్‌ఇంజిన్ 2.0 లైట్ టెక్నాలజీతో వస్తుంది.

Samsung Galaxy A07, Galaxy M07, Galaxy F07 Price

Samsung Galaxy A07 4G భారతదేశంలో 4GB RAM + 64GB స్టోరేజ్ బేస్ వేరియంట్ రూ.8,999 కు లాంచ్ అయింది. ఈ ఫోన్ ఒకే ఒక వేరియంట్‌లో వచ్చింది. వినియోగదారులు దీనిని గ్రీన్, బ్లాక్, లైట్ వైలెట్ కలర్‌లలో కొనుగోలు చేయవచ్చు. 

Samsung Galaxy F07 మోడల్ 4GB + 64GB కాన్ఫిగరేషన్ ధర రూ.7,699గా ఉంది. ఇది గ్రీన్ కలర్‌లో మాత్రమే అందించబడుతుంది. Galaxy M07 మోడల్ 4GB + 64GB కాన్ఫిగరేషన్ ధర అమెజాన్ ఇండియాలో రూ.6,999కి లిస్ట్ అయింది. ఇది బ్లాక్ కలర్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. వీటిని Samsung India e-స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్‌లతో పాటు భారతదేశం అంతటా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy A07, Galaxy M07, Galaxy F07 Specs

ఈ మూడు ఫోన్‌ల స్పెసిఫికేషన్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. Galaxy A07, F07, M07 4G అన్నీ Android 15, One UI 7 లపై నడుస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఆరు ప్రధాన OS అప్‌గ్రేడ్‌లు, ఆరు సంవత్సరాల భద్రతా అప్డేట్‌లను అందుకుంటాయని కంపెనీ పేర్కొంది. మూడు ఫోన్‌లు 90Hz రిఫ్రెష్ రేట్‌ను అందించే 6.7-అంగుళాల PLS LCD HD+ ప్యానెల్‌ను కలిగి ఉన్నాయి. 

మీడియాటెక్ హీలియో G99 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. దీనిలో కార్టెక్స్-A76, శక్తి-సమర్థవంతమైన కార్టెక్స్-A55 కోర్లు ఉన్నాయి. ఇది 4GB RAM + 64GB ఇంటర్నెల్ స్టోరేజ్‌తో వస్తుంది. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు పెంచుకోవచ్చు. వెనుక కెమెరా సెటప్‌లో.. 50MP ఆటోఫోకస్ ప్రైమరీ సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందు కెమెరాలో 8MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ మూడు ఫోన్‌లు 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. వాటికి దుమ్ము, నీటి నిరోధక కోసం IP54 రేటింగ్ ఉంది.

Advertisment
తాజా కథనాలు