Smart Phone: 13MP రియర్ కెమెరాతో రూ.7 వేల లోపే అదిరిపోయే ఫోన్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

మార్కెట్‌లోకి ఐటెల్ A90 లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. అదిరిపోయే ఫీచర్లతో తక్కువ ధరకే ఈ మొబైల్ వస్తోంది. అయితే 13MP కెమెరాతో ఉన్న ఈ మొబైల్ 3GB RAM వేరియంట్ ధర రూ.6,399 కాగా, 4GB RAM వేరియంట్ ధర రూ.6,899గా ఉంది.

New Update
A90 Limited Edition

A90 Limited Edition

మార్కెట్‌లోకి ఐటెల్ A90 లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. అదిరిపోయే ఫీచర్లతో తక్కువ ధరకే ఈ మొబైల్ వస్తోంది. అలాగే మిలిటరీ గ్రేడ్ రక్షణతో కూడిన మొదటి స్మార్ట్‌ఫోన్‌గా కూడా ఇది నిలుస్తోంది. దీని డిజైన్ చాలా ప్రత్యేకంగా, కెమెరా గ్రిడ్‌తో "మ్యాక్స్ స్వాగ్" లుక్‌ ఉంది. ఈ ఫోన్ ఐటెల్ 3P ప్రామిస్ అంటే దుమ్ము, నీరు, డ్రాప్స్ నుంచి రక్షణ ఇస్తుంది. అలాగే దీనికి IP54 రేటింగ్ కూడా ఉంది. దీనివల్ల ఇది వర్షం, దుమ్ము వంటి సమస్యలను కూడా తట్టుకోగలదు. అలాగే ఈ మొబైల్‌లో ప్రత్యేకమైన AI అసిస్టెంట్ కూడా ఉంది. అయితే A90 లిమిటెడ్ ఎడిషన్ రెండు వేర్వేరు RAM వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో 3GB RAM వేరియంట్ ధర రూ.6,399 కాగా, 4GB RAM వేరియంట్ ధర రూ.6,899గా ఉంది. ఈ మొబైల్ దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ స్టోర్లలో కూడా లభిస్తుంది. ఈ మొబైల్‌కు 100 రోజుల్లో ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ సౌకర్యం కూడా ఉంది. రూ.7 వేల లోపే అయినా కూడా బెస్ట్ ఫీచర్లతో ఉన్న ఈ మొబైల్ ఎక్కువ ఏళ్లు మన్నికగా వస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ మొబైల్ చూడటానికి కూడా చాలా స్టైలిష్‌గా ఉంటుంది. 

ఇది కూడా చూడండి: Redmi 15R 5G : వర్త్ వర్మ వర్త్.. 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీతో కొత్త ఫోన్ అదిరింది..!

ఇది కూడా చూడండి: Mobile Offers: రచ్చ రంబోలా.. మడత ఫోన్‌పై రూ.82వేల భారీ డిస్కౌంట్ - AMAZONలో అరాచకమైన ఆఫర్..!

గేమింగ్‌కు బెస్ట్ ఫోన్..

ఈ ఫోన్‌లోని మిగతా ఫీచర్లు కూడా బాగున్నాయి. ఇందులో 6.6 అంగుళాల 90Hz HD+ డిస్‌ప్లే ఉండటంతో పాటు DTS ఆధారిత సౌండ్ టెక్నాలజీ ఉంది. దీనివల్ల ఆడియో స్పష్టంగా వస్తుంది. అలాగే ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే, డైనమిక్ బార్ వంటి అదనపు ఫీచర్లు ఫోన్ బ్యాటరీ, కాల్స్ నోటిఫికేషన్లను సులభంగా చూసుకోవడానికి ఉపయోగపడతాయి. ఫోటోగ్రఫీ కోసం 13MP రియర్ కెమెరా ఉంది. ఇందులో కొత్తగా చేర్చిన స్లైడింగ్ జూమ్ బటన్ సహాయంతో ఒక చేతితోనే సులభంగా జూమ్ చేసి ఫోటోలు తీసుకోవచ్చు. ఫోన్ పనితీరు కోసం A90 లిమిటెడ్ ఎడిషన్‌లో శక్తివంతమైన ఆక్టా-కోర్ T7100 ప్రాసెసర్ ఉంది. ఇది మల్టీటాస్కింగ్, గేమింగ్, వీడియో కాల్స్‌ను సులభంగా నిర్వహించగలదు. భద్రత కోసం ఫేస్ అన్‌లాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. 5000mAh బ్యాటరీతో పాటు, 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇది రోజంతా ఫోన్ పనిచేసేలా చేస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్‌కు 36 నెలల లాగ్-ఫ్రీ ఫ్లూయెన్సీ వారంటీ కూడా లభిస్తుంది. దీనివల్ల మొబైల్ ఎక్కువ రోజులు వర్క్ చేస్తుంది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లతో మొబైల్ ఫోన్ కావాలనుకునే వారికి ఐటెల్ A90 లిమిటెడ్ ఎడిషన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. 

Advertisment
తాజా కథనాలు