/rtv/media/media_files/2025/09/17/redmi-15r-5g-price-2025-09-17-18-05-31.jpg)
Redmi 15R 5G Price
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ Redmi తన కొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ Redmi 15R 5Gని చైనాలో రిలీజ్ చేసింది. కంపెనీ దీనిని అనేక RAM + స్టోరేజ్ వేరియంట్‌లలో విడుదల చేసింది. ఈ ఫోన్ 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఇది 6.9-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. MediaTek Dimensity 6300 చిప్‌సెట్‌తో వచ్చింది. 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. కొత్త Redmi స్మార్ట్‌ఫోన్ HyperOS 2పై నడుస్తుంది. ఇది Android 15 ఆధారంగా పనిచేస్తుంది. ఇప్పుడు దీని ధర, ఫీచర్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Redmi 15R 5G Price
Redmi 15R 5G మొబైల్ మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.
4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,000.
6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,000
8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 23,000
8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 25,000
12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 28,000గా కంపెనీ నిర్ణయించింది.
ఈ స్మార్ట్‌ఫోన్‌ను క్లౌడీ వైట్, లైమ్ గ్రీన్, షాడో బ్లాక్, ట్విలైట్ పర్పుల్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు .
Redmi 15R 5G Specs
Redmi 15R 5G స్మార్ట్‌ఫోన్ 720×1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.9-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 810 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. Redmi 15R 5G ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది 12GB వరకు RAM + 256GB వరకు UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. కెమెరా సెటప్ విషయానికొస్తే.. Redmi 15R 5G ఫోన్ 13MP వెనుక కెమెరా, 5MP ముందు కెమెరాను కలిగి ఉంది.
కనెక్టివిటీ ఎంపికలలో.. Redmi 15R 5G మొబైల్ 5G, Wi-Fi, బ్లూటూత్ 5.4, USB టైప్-C పోర్ట్ వంటివి ఉన్నాయి. ఫోన్‌లో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, వర్చువల్ డిస్టెన్స్ సెన్సార్, వైబ్రేషన్ మోటార్ కూడా ఉన్నాయి. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ IP64 రేటింగ్‌తో వస్తుంది. అలాగే Redmi 15R 5G మొబైల్ 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6000mAh బ్యాటరీతో వస్తుంది.